హీరో శ్రీకాంత్ – దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ‘పెళ్లిసందడి’ ఒకటి. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే టైటిల్ తో.. అదే దర్శకేంద్రుడు సినిమా చేస్తున్నారు. అయితే.. రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకుడు కాదు.. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా తెరకెక్కించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాఘవేంద్రరావు మరో సినిమా చేయలేదు. ఆయన ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారట.
ముందుగా ‘పెళ్లిసందD’ సినిమాకి రాఘవేంద్రరావే దర్శకుడు అనుకున్నారు. మరి.. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. దర్శకత్వ బాధ్యతలను ఆయన శిష్యురాలు గౌరికి అప్పగించారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. కథానాయిక ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పెళ్లి సందడి లో డిని ఇంగ్లీషు D గా రాసారు. అలా.. రాయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. అది ఏంటనేది బయటపెట్టలేదు. అందుచేత ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇదిలా ఉంటే.. ఇందులో హీరో శ్రీకాంత్ నటించనున్నారని తెలిసింది. ఇంతకీ అది కీలక పాత్ర అని సమాచారం. కనిపించేది కాసేపే అయినా కథను మలుపు తిప్పే క్యారెక్టర్ అని టాక్. ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అఫిషియల్ గా మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలిసింది. తండ్రీకొడుకులు శ్రీకాంత్ – రోషన్ పై వచ్చే సీన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి అంటున్నారు. స్వరవాణి కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ పాటల రికార్డింగ్ స్టార్ట్ అయ్యింది. మరి.. నాటి ‘పెళ్లిసందడి’ లాగానే.. నేటి ‘పెళ్లిసందD’ కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
Must Read ;- ఈ హీరోయిన్స్ తో రొమాన్సా.. నిజమేనా దర్శకేంద్రా?