టీఆర్ ఎస్ అంటే అభిమానమో, జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రభావమో లేక పవన్ పై వ్యాఖ్యలు చేయడం వల్ల వైరల్ అవ్వచ్చనే లాజిక్ పట్టుకున్నాడో ఏమోగానీ మీడియాలో పవన్ ని ఉద్దేశించి ‘ఊసరవెల్లి’ అన్న మాటకు మంచి మైలేజ్ వచ్చినట్టుంది. ఈ మాట వినగానే పవన్ అభిమానులు భగ్గుమన్నారు. ప్రకాశ్ రాజ్ కౌంటర్ కు తనదైన రీతిలో ఎన్ కౌంటర్ లేఖాస్త్రాన్ని ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నాడు నాగబాబు.
ప్రకాష్ రాజ్ కి నా ans pic.twitter.com/Nu3WKdqMzr
— Naga Babu Konidela (@NagaBabuOffl) November 27, 2020
Must Read ;- పవన్, క్రిష్ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్?
కుహనా తెలివితో మాట్లాడకు
రాజకీయాలలో నిర్ణయాలు, పొత్తులు సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారుతుండడం మామూలు విషయమని కూడా తెలియడం తేదంటూ ఎద్దేవా చేశాడు. ప్రకాష్ ఒక కుహనా మేధావి అని, తన తెలివితో ఎన్ని వాగినా ఏమి ఉపయోగం ఉండదని చెప్పాడు. రాజకీయపరంగా విమర్శలు చేయడం తప్పు లేదని, కానీ మంచిని మెచ్చుకోలేని కుసంస్కారం ప్రదర్శించడం వల్ల నీ డొల్లతనాన్ని నువ్వే బయటవేసుకుంటున్నావని చెప్పుకొచ్చాడు.
ప్రజాస్వామ్యం వల్ల బతికిపోయావ్
మీడియా అడిగింది కదాని నోటి కొచ్చినట్టు మాట్లాడినా, ఇంకా నువ్వు వాగగలుగుతున్నావంటే దానికి కారణం ప్రజాస్వామ్యమని గుర్తుపెట్టుకో అని దాదాపు వార్నింగ్ ఇచ్చాడు. నాగబాబు కౌంటర్లు కాస్త వ్యక్తిత్వాన్ని కూడా తాకినట్టున్నాయి. నిర్మాతను ఇబ్బందిపెట్టే నువ్వు ముందు మంచి మనిషిగా మారమంటూ నాగబాబు హితవు పలికాడు. పవన్ లాంటి మంచి మనిషిని విమర్శించే అర్హత లేదంటూ బాగానే ఫైరయ్యాడు నాగబాబు.
మెగా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోడు
నాగబాబు ఇలా మాట్లాడడం కొత్తేమీ కాదు, గతంలో కూడా చిరంజీవిని ఎవరేమన్నా కూడా సమాధానాలు నాగబాబు నుండే వచ్చేవి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే వాళ్లకి తనదైన స్టైల్లో సమాధానాలతో సిద్ధంగా ఉంటాడు నాగబాబు. గతంలో కూడా ఇలాగే రామ్ గోపాల్ వర్మను కూడ మాటలన్నాడు. కానీ, నాగబాబు ఎంట్రీతో రాజకీయం కాస్త వ్యక్తిగతంగా మారినట్టు అనిపించకమారదు. మరి ఇది ఇంతటితో ఆగుతుందో… ఇంకా కౌంటర్, ఎన్ కౌంటర్ అంటూ ఎక్కడిదాకా పోతుందో చూడాలి.
Also Read ;- పవన్ అభిమానులను ఊరిస్తున్న డైరెక్టర్ క్రిష్