బాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్వీన్ కంగనా రనౌత్ ని నడిరోడ్డు మీద అత్యాచారం చేస్తానంటూ ఓ న్యాయవాది బెదిరింపు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కంగనా ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తనకు సంబందించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం కంగనా తన సోదరి పెళ్లి వేడుకలో బిజీగా ఉంది. తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటోంది. అయితే పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా కంగనా తన అభిమానులతో పంచుకుంది.
ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలకు ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగనా ఫోటోలు చూసిన సదరు లాయర్ ‘నిన్ను నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా’ అంటూ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇలాంటి వారిని దేశం నుండి బహిష్కరించాలని కొందరు కోరుకోగా, మరికొందరైతే ఏకంగా ఉరి తీయాలని అన్నారు. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు న్యాయవాది ఈ కామెంట్స్ పై స్పందించాడు.
తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురయ్యిందని తెలిపాడు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి దాని ద్వారా కంగనాపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టారని, తన స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని నేను కూడా షాక్‌కి గురయ్యానని తెలిపాడు. తనకు ఆడవారి పట్ల అపారమైన గౌరవం ఉందని తెలిపాడు. కొంతమంది ఆగంతకులు చేసిన ఈ అసభ్యకరమైన కామెంట్స్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి అని పోస్ట్ చేశాడు. అనంతరం సదరు న్యాయవాది తన ఫేస్ బుక్ అకౌంట్ ను డిలీట్ చేశాడు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆ న్యాయవాది కావాలనే కంగనాపై కామెంట్స్ చేసాడని అభిప్రాయపడుతున్నారు. అసలే ఫైర్ బ్రాండ్ అయిన కంగనా ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.