Telugu Student Talent In Astronomical Research In America :
స్వదేశంలో కాదు.. విదేశీ వేదికల మీద తెలుగువాళ్లు అదరగొడుతున్నారు. తెలుగమ్మాయి బండ్ల శిరీష అంతరిక్ష యాత్ర చేసి చరిత్రలో నిలిచిన సంఘటనను మరువకముందే.. విశాఖ యువకుడు ఖగోళ శాస్ర పరిశోధనలు చేసి ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఖగోళ శాస్త్ర పరిశోధనలకు అమెరికా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకుని, మరోసారి తెలుగోళ్ల గురించి మాట్లాడుకునేలా చేశాడు.
విశాఖ జిల్లా సీలేరుకు చెందిన భరద్వాజ్ కు చిన్నప్పట్నుంచే సైన్స్ పై ఆసక్తిని పెంచుకున్నాడు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బిటెక్ కంప్లీట్ చేసి, 2014లో ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళాడు. యూఎంకేసీ విశ్వవిద్యాలయం అర్హత పరీక్షలో ప్రధమస్ధానం దక్కించుకుని పరిశోధనలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం యూఎంకేసీలో పీహెచ్ డీ చేస్తున్నాడు. విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి భరధ్వాజ్ పరిశోధనలు చేశాడు. ఏడేళ్ళపాటు ఎన్నో పరిశోధనలు చేశాడు.
భరద్వాజ్ చేసిన పరిశోధనలకు గుర్తింపుగా అమెరికా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. ఇందుకుగాను నాసా ఉపకార వేతనం అందించనుంది. ఖగోళ శాస్త్రంపై భారతీయ పిల్లలకు ఆసక్తిని కలిగిస్తానని, త్వరలో భారతదేశానికి వస్తానని భరద్వాజ్ తెలిపారు.
Must Read ;- ‘స్పెల్ బీ’ పోటీల్లో నల్లజాతి బాలిక సంచలనం!











