కాలం మారినపుడు, వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు జలుబు చేయడం సహజమైన విషయం. కానీ, కరోనా నేపథ్యంలో జలుబు చేసిన వారిని చూస్తే చాలు జనాలు కరోనా ఉందేమో అని భయపడిపోతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో తరచూ జలుబు చేసిన వారిని పరిశీలించిన పరిశోధకులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఏంటి మరో జబ్బు గురించి చెప్పారేమో అని భయపడకండి. తరుచూ జలుబు కూడా మంచిదే అంటున్నారు విశ్లేషకులు. మరి జలుబుతో కరోనాకు జరిగే మంచేమిటో.. అదెలాగో చూద్దాం రండి..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
మామూలుగా జలుబు రైనా, ఇన్ప్లూయోంజా వంటి వాటి వల్ల వస్తుంది. కానీ కొన్ని జలుబులు కొవిడ్ కారకాలలైన కొన్ని వైరస్ల వల్ల వస్తాయని పరిశోధకులు తెలుసుకున్నారు. దాని వల్ల రోగనిరోధక శక్తి నిరంతరం పెరగడంలో జలుబు కీలక పాత్ర పోషిస్తుందట. అలా జరగడం వల్ల కొవిడ్ నుంచి దీర్ఘకాలిక లేదా జీవితాంతం రాకుండా రక్షణ కలుగుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
మెమరీ-బి పనిచేస్తుంది
కరోనా వైరస్ కారకాల కారణంగా జలుబు చేసినపుడు.. అందుకు కారణమైన వైరస్ను రోగ నిరోధక వ్యవస్థలోని మెమరీ-బి కణాలు రిజిస్టర్ చేసుకుంటాయని పరిశోధకులు తెలుపుతున్నారు. తిరిగి అదే వైరస్ లేదా దాన్ని పోలిన కారకాలు శరీరంలో ప్రవేశించినపుడు ఈ కణాలు యాంటీ బాడీలను విడుదల చేస్తాయని, వాటి ద్వారా రోగం తీవ్ర రూపం దాల్చకమునుపే అడ్డుకట్టవేసే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ మెమరీ-బి కణాలు కొన్ని సంవత్సారాల పాటు శరీరంలో జీవించి ఉంటాయి. ఆ కారణంగా కరోనా వైరస్ను పోలిని వాటి వల్ల వచ్చే జలుబును వెంటనే అడ్డుకుంటాయి. అంతేకాదు, కొవిడ్ సోకినా కూడా ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మొత్తానికి జలుబు చేయడం కూడా ఎంతో మేలని ఇప్పుడే అర్థమవుతుంది. అలాగని జలుబును నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదని కూడా పరిశోధకులు చెప్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే టెస్ట్లు చేయించుకుని ఐసోలేషన్ పాటించాలి, మన నుండి ఇతరులకు సోకకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.
Must Read ;- కొవిడ్ తీవ్రతకు కారణమైన జీన్స్ చికిత్సకు తోడ్పడుతాయట!











