కరోనా తర్వాత అసలైన ప్రపంచీకరణ అంటే ఏంటో తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో చిన్న సంస్థల నుండి దేశాధినేతల వరకు వర్చువల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జరిగే గ్లోబల్ సమ్మిట్, ఈ సంవత్సరం కాస్త భిన్నంగా జరిగినా.. మేధావులు ఈ సరికొత్త ప్రారంభాన్ని మరింత విజయాన్ని అందించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పెట్టుబడిదారులు పాల్గొన్న ఈ వర్చువల్ సదస్సులో, బిల్ గేట్స్‌కు ప్రతిష్ఠాత్మకమైన ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ను అందించింది టై గ్లోబల్.
అంతా వర్చువల్ మయం
3 రోజుల పాటు వర్చువల్ గా జరిగిన సదస్సులో ప్రపంచంలోని ఎందరో మేధావులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కరోనా తర్వాత సరికొత్త ప్రారంభించబోతున్న ప్రపంచ వ్యాపారానికి విలువైన సందేశాన్ని అందించారు. వర్చువల్ అవార్డుపై బిల్ గేట్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపన్యసిస్తూ.. ప్రపంచానికి కరోనా కారణంగా ఎదురవుతోన్న సవాళ్లను సరికొత్త ఆవిష్కరణలతో సమాధానం చెప్పాలని తెలియజేశారు. అందుకోసం పరిశోధకులు కృషి అవసరమని స్పష్టీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతా ఒక్కటిగా పనిచేస్తూ, ఒకరికొకరు సహరించుకున్నప్పుడే కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని, అప్పుడే ప్రస్తుత సమస్యలను దాటి ప్రపంచం తిరిగి పునరుత్తేజం సంతరించుకుంటుందని అందరిలో స్ఫూర్తినింపారు.
పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని, వారి విధానాలు ప్రజలకు అందాలంటే అందరూ కలిసి సహకరిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. అందుకు కొవిడ్ టీకానే ఉదాహరించారు. పరిశోధకులు ఎంత గొప్పదాన్ని కనిపెట్టినా, అది ప్రయోగశాలను దాటి జనావాసాల్లోకి వచ్చినపుడే దాని మంచైనా, చెడైనా తేటతెల్లమవుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటేనే కరోనాను అంతం చేయడంతోపాటు, సరికొత్త ప్రారంభాన్ని విజయవంతం చేయగలమని అన్నారు.
Must Read ;- ఆ వెలుగులు మా తెలుగుదేశానివే: చంద్రబాబు