కొవిడ్-19 ప్రపంచ స్థితిగతులను మార్చేసింది. ఆఫీస్ వర్క్ నుండి దేశాధినేతల మీటింగ్ వరకు అన్నీ వర్చువల్ రూపంలో జరుగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే గ్లోబల్ సమ్మిట్ లో ఈ ఏడాది ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచ దేశాలలోని మేధావులు, వ్యాపారవేత్తలు, దేశాధినేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రలు పాల్లొనే ఈ సమ్మిట్ లో దిశానిర్ధేశం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వనం అందింది. ప్రపంచం సరికొత్త మొదలుపెడుతున్న ప్రారంభానికి చంద్రబాబు తన సందేశం అందించబోతున్నారు.
ప్రపంచ మేధావుల సమాహారం
కొవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థక స్థితి దారుణంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగం కుదేలైంది. మళ్లీ పరిస్థితిని మామూలుగా తీసుకురావడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రపంచంలోని మేధావులంతా తమ సందేశాలను అందించడానికి ‘ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థాపకత సమ్మిట్ – 2020’ వేదికను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ ను హైదరాబార్ చాప్టర్ నిర్వహిస్తుంది. డిసెంబర్ 8 నుంచి 10 వరకు జరిగే ఈ సమ్మిట్ లో దాదాపు 25 పైన దేశాలు, 20,000 పైన వ్యవస్థాపకులు, 200 పైన పెట్టుబడిదారులు, 300 పైన ఉపన్యాసకులు వర్చ్యువల్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు.
Must Read ;- ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏమిటో చూపించిన చంద్రబాబు
చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం
సాధారణంగా రాజకీయ నాయకులను ఆహ్వనించే విషయంలో దాదాపు అధికారంలో ఉన్నవారినే ఆహ్వానించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, సద్గురు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులలో ఒకరైన నారాయణ మూర్తి… ఇలా ఎందరో మేధావులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పతిపక్ష నేత, విజనరీ లీడర్ గా పేరుగాంచిన నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆహ్వనం మేరకు ప్రసంగించనున్నారు.
గత నెలలో ఐఐటీ బాంబే విధ్యార్థులలో ముచ్చటించిన చంద్రబాబు గ్లోబలైజేషన్ గురించి విధ్యార్థలకు అర్థమయ్యేలా వివరించారు. కొవిడ్ గ్లోబలైజేషన్ ని మరింత ఆవస్యకత చేసిందని చెప్పారు. సోషల్ మీడియాలోని నెగిటివిటీని ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు వివరించారు. అంతేకాదు, భవిషత్తులో టెక్నాలజీ ముఖ్యపాత్ర పోషిస్తుందని దాని ప్రాధాన్యత గురించి కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు.
ప్రపంచ సమ్మిట్ లో కూడా గ్లోబలైజేషన్, క్లౌడ్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, పెట్టుబడులు, వ్యాపార అవకాశాల గురించి మేధావులు ప్రసంగించబోతున్నారు. వీటితోపాటు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై కూడా మేధావులు తమ సలహాలు అందించబోతున్నారని తెలుస్తుంది.
Also Read ;- స్పీకరు పోడియం ఎదుట చంద్రబాబు బైఠాయింపు