August 9, 2026 7:26 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తెలంగాణ ఫలితాలు.. ఏపీ విపక్షాలకు ఆశాకిరణాలు!

దుబ్బాక సహా, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు.. తెరాసకు మింగుడు పడనివే! అయితే ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి. అందరి అంచనాలు ఈ దిశగా సాగుతున్నాయి.

December 5, 2020 at 8:54 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చినప్పుడు, అది తమ సిటింగ్ స్థానం అయినప్పుడు రూలింగ్‌లో ఉండే పార్టీ ఎడ్వాంటేజీ తీసుకోవడం, నెగ్గడం చాలావరకు జరుగుతుంటుంది. కానీ.. దుబ్బాకలో ఫలితం తిరగబడింది. టీఆర్ఎస్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికలు వారికి రెండో లిట్మస్ టెస్టులా మారాయి. గ్రేటర్ లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేలా విజయం సాధిస్తే.. దుబ్బాక పరాజయానికి రకరకాల సాకులు చెప్పేసి ఊపిరి పీల్చుకోవచ్చునని గులాబీ దళం భావించింది. కానీ.. గ్రేటర్ ఫలితాలు వారికి అంతకంటె చేదుగా వచ్చాయి. 99 స్థానాల వద్ద ఉన్న టీఆర్ఎస్ చివరికి 55 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. కోఆప్షన్ బలం కలుపుకున్నా కూడా మేయర్ పీఠం దక్కని పరిస్థితి. తమ ఓటమికంటె మించి.. బీజేపీ అనూహ్యంగా బలపడి 4 సీట్లనుంచి 48 సీట్లకు ఎదగడం వారికి మరింత మింగుడుపడని సంగతి. మరి ఈ ఫలితాలు ఇతర ప్రాంతాలకు, ప్రధానంగా ఓటరు భావజాలం దగ్గరగా ఉండగల ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి? అనేది ఇప్పుడు కీలకాంశం.

ఏపీ పాలకపక్షానికి హెచ్చరికే!

పాలకుల పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ఏర్పడితే.. దాన్ని ప్రదర్శించడానికి వాళ్లు అయిదేళ్ల దాకా వేచిచూడడం లేదు. ప్రభుత్వం పనితీరు అనుకున్నంత సంతృప్తికరంగా లేనప్పుడు మరికొంత కాలం వేచిచూద్దాం అనే ధోరణి ప్రజల్లో ఇప్పుడు లేదు. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు ఇందుకు ఉదాహరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లు అవుతున్నాయి. ఈలోగా ప్రభుత్వం అపరిమితమైన అప్రతిష్టను మూటగట్టుకున్నదనడానికి ఇప్పటి ఈ పరీక్ష ఫలితాలు నిదర్శననం.

జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి పరీక్ష ఎదురు కాబోతున్నది. అధికారంలోకి వచ్చిననాటి నుంచి జగన్ ఒక కొత్త పంథాలో పాలన సాగిస్తూ పోతున్నారు. సంక్షేమం అంటే జనం జేబులో డబ్బులు పెట్టేయడమే అనే కొత్త నిర్వచనానికి ఆయన రూపకర్త. అది మంచా? చెడా? కరెక్టా? కాదా? అన్నది ముందుముందు ప్రజాతీర్పులు నిర్ణయిస్తాయి.

అయితే తీర్పు కోరడానికి ప్రజల వద్దకు వెళ్లడానికి కూడా అక్కడ ప్రభుత్వం సిద్ధంగా లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ అనుకున్న సమయానికి నిర్వహించకుండా అడ్డుపడుతూ… కోర్టులో పిటిషన్లు నడుపుతుండడమూ, అసెంబ్లీ తీర్మానం చేయడమే ఇందుకు రుజువులు. నిజంగా తాము అనుకుంటున్న (చేస్తున్న) సంక్షేమమే గెలిపిస్తుందనే నమ్మకం ఉంటే.. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి వెరపు ఎందుకు? అనేది ప్రజల అనుమానం. తాము నియమించే- తమకు అనుకూలమైన ఎన్నికల కమిషనర్ వచ్చేదాకా ఎన్నికలకు వెళ్లకూడదని అనుకోవడం ప్రభుత్వంలో భయానికి కాక మరెందుకు సంకేతం.. ఇలాంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

కానీ.. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎదుర్కొనవలసి వచ్చే తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక కూడా దగ్గర్లోనే ఉంది. రాష్ట్రంలో కరోనా ఉంది.. మేం ఎన్నికలు పెట్టం అని మొండికేయడానికి వీల్లేదు. అవకాశం కూడా లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు వీరు ఎన్నికలకు వెళ్లాల్సిందే. అసెంబ్లీలో తీర్మానం చేయడానికి, హైకోర్టులో కేసు వేయడానికీ కుదర్దు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక సర్వత్రా చర్చనీయాంశం కావడం సహజం.

Also Read ;- గ్రేటర్ పరాజయం- దుబ్బాకకు 2.0

విపక్షాల్లో ఆశలు

తెలంగాణ ఫలితాలు ఏపీ విపక్షాల్లో మాత్రం ఆశలు రేకెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్నంత మాత్రాన, హఠాన్మరణం పర్యవసానంగా వచ్చే ఉపఎన్నిక అయినంత మాత్రాన ప్రభుత్వం ఏకపక్షంగా గెలిచిపోవడం అసాధ్యం అనే నమ్మకం వారికి కలుగుతోంది.

తిరుపతి ఉపఎన్నిక విషయానికి వస్తే.. నెల్లూరు జిల్లాలో నాలుగు, చిత్తూరుజిల్లాలో మూడు నియోజకవర్గాలు ఈ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఈ అన్ని స్థానాల్లోనూ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అంతమాత్రాన.. ఏకపక్షంగా వైఎస్సార్సీపీ మునుపటి విజయాన్ని పునరావృతం చేస్తుందనే నమ్మకం లేదు.

ప్రధానంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్.. పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నేను సొంతంగా గెలిచానే తప్ప.. జగన్ బొమ్మతో  కాదని వరప్రసాద్ ఆ మధ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కూడా. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మీద అసంతృప్తితో బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్ ప్రభావం చూపగలిగేంత శక్తి ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ కు దెబ్బ తప్పదు.

మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ స్థానిక నాయకత్వం, స్థానికంగా వారి వారి వ్యవహార సరళి మీద ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ సంక్షేమ పాలనను, డబ్బులు ఉదారంగా అందరికీ పంచి పెట్టేసే టెక్నిక్ ను నమ్ముకుంటున్నదో.. ఆ సిద్ధాంతానికి- స్థానిక నాయకులపై వ్యతిరేకతను మించిన జనాదరణ ఉన్నదో లేదో ఈ ఎన్నికల్లో సూచన ప్రాయంగా తేలుతుంది.

ప్రతిపక్షాల ఆశ కూడా అదే.. ఏపీలో ప్రతిపక్షాలు చాలా క్రియాశీలంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తొలినుంచి ప్రభుత్వపు ప్రతి వైఫల్యం మీద విరుచుకుపడుతోంది. ఏ మాత్రం అవకాశం వచ్చినా విడిచిపెట్టడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం జగన్ తో స్నేహపూర్వక విమర్శలు చేస్తున్నట్టుగా ఉంటున్నది గానీ.. తిరుపతి ఉప ఎన్నిక విషయానికి వస్తే వారికి చాలా ఆశ ఉంది. గతంలో ఒకసారి ఇక్కడ పార్టీ గెలిచిన చరిత్ర ఉండడంతో.. మళ్లీ నెగ్గగలమని అనుకుంటున్నారు. చాలా తీవ్రంగా ఈ ఉప ఎన్నిక గురించి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుదఫాలుగా తిరుపతిలోనే స్థానిక నాయకులతో రాష్ట్ర జాతీయ స్థాయి వ్యూహకర్తలు, నాయకులు సమావేశాలు నిర్వహించుకుని ముందుకు సాగుతున్నారు.  వారితో పొత్తులు పెట్టుకుని ఉన్న పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఈ సీటునుంచి ఆయన స్వయంగా తన పార్టీ తరఫున ఎవరినీ బరిలోకి దించకపోవచ్చు గానీ.. ఎన్నికల నేపథ్యంలో పార్టీని యాక్టివేట్ చేయడానికి తుపాను పరామర్శ యాత్ర పెట్టుకున్నారనే విమర్శ ఉంది. రాష్ట్రంలో ఆరు జిల్లాలు నివర్ బారిన పడి తీవ్రంగా నష్టపోతే.. గుంటూరు-కృష్ణా జిల్లాలకు ఒక్కరోజు కేటాయించి, నెల్లూరు-చిత్తూరు జిల్లాలకు మూడు రోజులు కేటాయించడం వెనుక ఆంతర్యం కూడా ఎన్నికలే అనే వాదన ఉంది. అంటే- విపక్ష పార్టీలన్నీ ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గానే తీసుకుంటున్నాయనే సంగతి అర్థమవుతోంది.

బలాబలాలు బేరీజు వేస్తే..

2019 ఎన్నికల్లో ఇక్కడినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా  2,28,376 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్ కు 7,22,877 ఓట్లు వస్తే, తెలుగుదేశం అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి లభించిన ఓట్లు 4,94,501 మాత్రమే. బిజెపి అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు కేవలం 16,125 ఓట్లు వచ్చాయి. అయినా వారు  దుబ్బాక, గ్రేటర్ ఫలితాలను చూసుకుని మురిసిపోతూ.. తిరుపతిలో కూడా గెలిచేయగలమని బీరాలు పలుకుతున్నారు.

బీజేపీ కూడా బలం పెంచుకుని పోటీకి దిగుతోంది. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించిన పవన్ ఇక్కడ ఎన్నిక గురించి పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ.. ఈ దఫా అలా వదిలిపెడతారని అనుకోలేం. వారు గట్టిగా తలపడితే తమ ఓట్లను బాగా పెంచుకుంటారు. తెలుగుదేశం కూడా- ప్రజల్లో తమకు బలం పెరిగి ఉంటుందనే భావనతోనే ఉంది. పైగా అభ్యర్థిని అందరికంటె ముందు ప్రకటించడం ఎడ్వాంటేజీ అవుతుందనే విశ్వాసంతో ఉంది. ఇలా తెలుగుదేశం, బిజెపి-జనసేన పార్టీలు ఇద్దరూ బలంగా పోటీ పడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటాయని- అంతిమంగా మళ్లీ వైఎస్సార్ సీపీ లాభపడుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఖరారుగా ఇలా జరుగుతుందనుకోలేం. అందుకే విపక్షాలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి.

ఏది ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఒక విషయం నిరూపించాయి. పాలకపక్షాలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు వెనుకాడడం లేదు.. అనేది నిరూపణ అయింది. అదే సూత్రం తిరుపతిలో కూడా పనిచేస్తుందని.. ఏపీలో రాజకీయ మార్పులకు ఈ ఎన్నికలు బీజం వేస్తాయని విపక్షాలు ఆశలు పెంచుకుంటున్నాయి.

.. సురేష్ పిళ్లె

Must Read ;- పోలింగ్ శాతం ఫ్లస్సా, మైనస్సా.. ఎవరి అంచనాల్లో వారు

Tags: ap bjpap state election commissionbjpcorona effectdubbaka resultghmc resultsgreater electionshero pawan kalyanjagan mohan reddyleotopopposition partiestdpthe leo newsthe leo news telugutirupati bypoll elections 2020trsycp
Previous Post

పెళ్లికుమార్తెగా మెగాడాటర్ నీహారిక 

Next Post

‘రాజకీయం’ సినిమాగా మారితే.. తీపి, చేదు అనుభవాలు

Related Posts

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (125వ జయంతి)..

ముఖ్య కథనాలు

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist