యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ రియాల్టీ షో చేయడానికి ఓకే చెప్పి.. అందర్నీ సర్ ఫ్రైజ్ చేసారని చెప్పచ్చు. కారణం ఏంటంటే.. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ ల పై యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో ఫిబ్రవరికి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని రాజమౌళి ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఇంత బిజీగా ఉండి కూడా ఎన్టీఆర్ రియాల్టీ షోకు ఓకే చెప్పడం విశేషం.
ఎన్టీఆర్ రియాల్టీ షో చేయడానికి ఓకే చెప్పారని వార్తలు రాగానే.. ఇదేదో గాసిప్ అనుకున్నారు. అయితే.. ఆతర్వాత తెలిసింది ఇది గాసిప్ కాదు వాస్తవం అని. ఈ షోకు సంబంధించి వర్క్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది.? ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనేది తెలియాల్సివుంది. ఈ షో విషయానికి వస్తే.. అమితాబ్ కౌన్ బనే గా కరోడపతి తరహాలా ఎన్టీఆర్ చేయనున్న రియాల్టీ షో ఉంటుందట. ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్ గతంలో బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేశారు.
ఆ షో సక్సస్ అయ్యింది. రికార్డు స్ధాయిలో టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఎన్టీఆర్ క్రేజ్ ఈ షోకు ప్లస్ అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. ఇంతకీ రెమ్యూనరేషన్ ఎంతంటే.. అక్షరాల 18 కోట్ల రెమ్యూనరేషన్ అని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే.. టెలివిజన్ షో ద్వారా భారీ మొత్తం అందుకున్న హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం.
Must Read ;- రియాల్టీ షో చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.