గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారం కార్యక్రమాలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. దుబ్బాక తరహాలో ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. దుబ్బాక ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ఇదే తరహాలో ప్రచారం చేశాయి. అయితే బీజేపీ మాత్రమే ఇందులో సక్సెస్ అయ్యింది. టీఆర్ఎస్ పార్టీకి చెక్ చెప్పి విజయ కేతనం ఎగుర వేసింది . దీంతో ఈ ఫార్ములానే గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి అనుసరించేందుకు పార్టీలు ప్రయత్నలు చేస్తున్నాయి. ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉండటంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి.
గ్రామాలు, మండలాల నుండి నేతల తరలింపు
గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో ప్రచారం కోసం పార్టీల ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా గ్రామాల నుండి హైదరాబాద్‌కు వచ్చి సెటిల్ అయిన వారే ఎక్కువగా ఉంటారు. వారికి ఇక్కడే ఓటు హక్కు కూడా ఉంటుంది. దీంతో అక్కడ నేతలతో ఓట్ల కోసం ప్రచారం చేయిస్తే సత్పలితాలొస్తాయని పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం గ్రామ, మండల స్థాయి నేతలను గ్రేటర్‌లో మోహరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఇలా నగరంలో వాలిపోయినట్టు తెలుస్తోంది. ఇక షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. నగరంలో ఉండే వారే చెప్పడం కన్నా ఇలా సొంత ఊరు, మండలాల నుండి వచ్చి చెబిదే ప్రజల్లో మంచి స్పందన వచ్చే అవకాశం ఉందన్న భావనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు.
Must Read: బీజేపీ వైపు నేతల చూపు..
రంగంలోకి మంత్రులు..
కార్యకర్తలను , మండల స్థాయి నేతలను హైదరాబాద్ తరలించేందుకు మంత్రులు కూడా రంగంలోకి దిగారు. వివిధ జిల్లాల నుండి తమ పార్టీ కేడర్‌ను గ్రేటర్‌లో మోహరించనున్నారు. గ్రామాల్లో , మండలాల్లో ఓట్లను ప్రభావితం చేసే నేతలు , ప్రజలతో మంచి సంభందాలు కలిగిన వారిని గుర్తించి ఈ పనిలో నిమగ్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. డివిజన్ల వారీగా వారి సొంత ఊర్లవారు ఉండే ప్రాంతాల్లో వీరితో ప్రచారం చేయించడం ద్వారా వచ్చే ఓట్లు కూడా తమకు లాభిస్తాయని భావిస్తున్నారు అధికార పార్టీ నేతలు. దుబ్బాక ఉప ఎన్నికలో ఈ వ్యవహారం బెడిసి కొట్టినా గ్రేటర్‌లో ఈ ప్లాన్ ఖచ్చితంగా లాభిస్తుందన్న భావనలో ఉన్న టీఆర్ఎస్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read: మేయర్ పీఠం… వయా వరద భీబత్సం