తమిళ హీరో దళపతి విజయ్ ‘మాస్టర్’ ఆన్ లైన్ లో విడుదల కావడం సంచలనం కలిగించింది. వాస్తవానికి ఈ సినిమా రేపు విడుదల కావలసి ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ఈ రాత్రికే విడుదల చేయడానికి ప్రత్యేక అనుమతులు కూడా మంజూరయ్యాయి. సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాదాపు 3 గంటల నిడివి ఉన్న సినిమా సినిమా ఇది. ఇలా ఆన్ లైన్ లో లీక్ కావడంతో నిర్మాతలు అప్రమత్తమయ్యారు.
ఇందులో విజయ్ సేతుపతి మరో కీలక పాత్రను పోషించారు. విజయ్ సరసన మాళవికా మోహనన్ నటించింది. ఆండ్రియా జెరెమియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ తదితరులు నటించారు. మొదట్లో ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని అనుకున్నారు. నిర్ణయాన్ని మార్చుకుని ఈ పొంగల్ కు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తమిళంలోనూ, తెలుగులోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆన్ లైన్ లో లీకైన ఈ సినిమాని ఎవరికీ షేర్ చేయవద్దంటూ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కోరారు.
Must Read ;- విజయ్ డైరెక్టర్ తో చరణ్ సినిమా.. !