కోవిడ్ 19 నుంచి మన దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా.. మళ్ళీ సెకెండ్ వేవ్ రూపంలో ఆ మహమ్మారి మళ్ళీ విరుచుకుపడింది. మరోసారి రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రత్యేకించి.. బాలీవుడ్ లో కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రముఖ నటీనటులందరూ కోవిడ్ బారీన పడుతూ.. ఆందోళన కలిగిస్తున్నారు.
ఇటీవల పరేశ్ రావల్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, ఆలియా భట్ కోవిడ్ బారిన పడి.. హోమ్ క్వారంటైన్ లో ఉండగా.. తాజాగా బాలీవుడ్ అందాల తార కత్రిని కైఫ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల కత్రినా తన సోదరి ఇజబెల్లాతో కలిసి బాంద్రాలోని ఒక హోటల్ కి డిన్నర్ కు వెళ్ళింది. ఆ కారణంగానే ఆమె కరోనా బారినపడినట్టు సమాచారం.
కరోనా సెకండ్ వేవ్ కారణంగానే .. బాలీవుడ్ లోని పెద్ద సినిమాల్ని థియేటర్స్ లో విడుదల చేయడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. హీరోలు సైతం షూటింగ్స్ లో పాల్గొనడానికి జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆందోళనలు మొదలయ్యాయి. వరుసగా బాలీవుడ్ తారలంతా కరోనా బారిన పడుతుండడం కలవర పెడుతోంది. మరి ఈ సెకండ్ వేవ్ కి ఇంకెంత మంది నటీనటులు బలి అవుతారో చూడాలి.
Must Read ;- కరోనా రికార్డు : ఒక్కరోజు ఇండియాలో ఇన్ని కేసులా..