విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటకీరణకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అంటూ ఫ్యాక్టరీ కార్మికులతో పాటు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నా.. మోదీ సర్కారు వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తనదైన స్పీడులో వెళుతోంది. ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ త్వరలోనే పూర్తి కానుంది. ఈ ఫ్యాక్టరీని చేజిక్కించుకునేందుకు దేశ, అంతర్జాతీయ స్థాయి ఉక్కు రంగంలో పేరెన్నికగన్న సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా భారత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ విశాఖకును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. విశాఖ ఉక్కును కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని టాటా స్టీల్ ఎండీ, సీఈఓ టీవీ నరేంద్రన్ ప్రకటించారు. విశాఖ ఉక్కును టాటా స్టీల్ చేజిక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తోందన్న వార్తలను ఆయన ధ్రువీకరించారు.
ఉక్కు ఉద్యమానికి టీడీపీ దన్ను
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేసే వార్తలు వినిపించిన వెంటనే ఏపీలో కలకం రేగింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించిన నాటి నుంచి విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నిరసనలకు విపక్ష టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటుగా ఉద్యమాల్లోనూ స్వయంగా పాలుపంచుకుంది. అంతేకాకుండా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎంపీ పదవులకు రాజీనామాలకు సిద్ధమని కూడా టీడీపీ ఎంపీలు ప్రకటించారు. వైసీపీ ఎంపీలు ముందుకు వస్తే.. వారితో కలిసి రాజీనామాలు చేస్తామని టీడీపీ ప్రకటించినా.. వైసీపీ నుంచి స్పందనే లేదు. తాజాగా విశాఖ ఉక్కును కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరచిన నేపథ్యంలో ఆ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఇక ఛాన్సే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- దోపిడీలో వైసీపీ ఇలా బుక్కైపోయింది











