విశాఖపట్నంలో మానసిక వికలాంగుల పాఠశాలను కూల్చివేసి, సీజ్ చేసిన అధికారులపై బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు విరుచుకుపడ్డారు. అసలు జీవీఎంసీ అధికారులు మనుషులా, పశువులా, వారికేమైనా మెంటల్ ఎక్కిందా అంటూ విష్ణుకుమార్ రాజు ఆగ్రహానికి లోనయ్యారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన ఈ ప్రభుత్వం ప్రస్తుతం మానసిక వికలాంగుల పాఠశాలను కూల్చేదాకా వచ్చారని ఆయన ధ్వజమెత్తారు. జీవీఎంసీ అధికారులకేనా మెంటల్ వచ్చిందేమో తనకు అర్థం కావడం లేదన్నారు. అధికార మదంతో విర్రవీగేవారికి తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది రాక్షస ప్రభుత్వం.. ప్రజలు మేలుకోవాలి
రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందని,ఇలాంటి వింత ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుతున్నారని ఆయన తప్పుపట్టారు. అపర్ణ విషయంలో పోలీసులు అతి చేయాల్సిన అవసరం లేదని,డాక్టర్ సుధాకర్‌ను చంపింది కూడా ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. నియంతల పాలన ఎలా ఉంటుందో, పోలీసులు చూపించాలనుకుంటున్నారా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ప్రతి పథకంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటోలు కూడా వేస్తే వారి పేర్లయినా జనాలకు తెలుస్తాయని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు.
Must Read ;- ‘హిడెన్ స్పౌట్స్’పై పునరాలోచన చేయండి.. జగన్‌కు మాజీ బీసీసీఐ కోచ్ విన్నపం










