వాళ్లు మామూలుగా ఉన్నప్పుడే రెచ్చిపోయారు. విపరీతంగా చెలరేగిపోయారు. టెండర్ ఏదైనా వాళ్లకే.. కాంట్రాక్టు ఏదైనా వాళ్ల మనుషులకే.. ఉద్యోగం ఏదైనా వాళ్ల వాళ్లకే.. మైన్ కూడా ఏదైనా వారికే.. ఒప్పందం పాతదైనా.. కొత్త ఒప్పందం చేసుకోవాల్సిందే.. అలా ప్రతి దాంట్లో దూరిపోయి.. ల్యాండ్ కబ్జా చేసినట్లే.. మొత్తం రాష్ట్రాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అందులో కొంత సక్సెస్ అయితే.. కొన్ని చోట్ల ప్రతిఘటన ఎదురైంది. అందులోనూ వారిలో వారికే తగాదాలు కూడా వచ్చాయి. ఇదంతా 2019లో 151 సీట్లు వచ్చినందుకే. మరి ఇప్పుడు పంచాయతీలు, మున్సిపాలిటీలు రెండిటిలోనూ ఆధిపత్యం చూపించడంతో ఇక రెచ్చిపోదాం బ్రదర్ అని వైసీపీ నేతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అధినేత జగన్మోహన్‌రెడ్డి సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుంది.

ప్రత్యర్థులకు వార్నింగులు..
అటు అర్బన్, ఇటు రూరల్ రెండూ మనవే.. ఇక ప్రతిపక్షం అనేది కనపడకూడదు.. తొక్కిపారేయండి అంటూ దిశా నిర్దేశం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇక వైసీపీ నేతలు తమ యాక్టివిటీస్‌ని మరింత పెంచబోతున్నారు. ఇక ప్రత్యర్ధులు అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోవాల్సిందేనని అప్పుడే వార్నింగులు వచ్చేస్తున్నాయి. తాడిపత్రి, మైదుకూరుల్లో జరుగుతున్న తంతు చూస్తున్నా అదే అనిపిస్తోంది.
వ్యాపారవర్గాల్లో చర్చ..
ఇప్పటి వరకు ముందు ఆఫర్ ఇవ్వడం.. ఒప్పుకోకపోతే బెదిరించడం.. బెదరకపోతే కేసు పెట్టించడం ఇలా స్టెప్ బై స్టెప్ వైసీపీ వాళ్లు వెళ్లేవారు. ఇప్పుడిక అలా కాదు.. డైరెక్ట్ అటాక్.. ఏం చేయాలో వాళ్లే ముందే నిర్ణయించి చెప్పేస్తారు.. అది ఫాలో అవటమే.. లేదంటే అనే ప్రశ్నే రాదిక. ఇదే చర్చ నడుస్తోంది ఇప్పుడు వ్యాపార వర్గాల్లో. చాలామంది ఇక ఏపీలో వ్యాపారం చేసుకునే బదులు.. హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లడం బెటరని అనుకుంటున్నారు.
సైలెంటుగా ఉండటమే..
ఇక టీడీపీ నేతలైతే మరింత టెన్షన్‌లో పడ్డారు. వ్యాపారాలపై ఆధారపడ్డ టీడీపీ నేతలైతే మరింత టెన్షన్‌లో పడ్డారు. ఇక రాష్ట్రంలో తామేమీ చేయలేమనే భయంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. అందుకే ఇక మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు సైలెంటుగా ఉండటమే బెటరని అనుకుంటున్నారని సమాచారం. అయితే చంద్రబాబునాయుడు, లోకేష్‌లు మాత్రం అలా కాకుండా ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో చాలామంది నేతలు యాక్టివ్ రోల్ ప్లే చేయకపోవడం ఎంత నష్టం చేసిందో వారికి వివరిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. ఇక వైసీపీ నేతలు రెచ్చిపోవడం ఖాయం. అది ఏరకంగా అనేది కొన్నిరోజులు ఆగితే తెలుస్తుంది.
Also Read :వైసీపీ కార్యకర్త చేతిలో మోసపోయిన అమ్మాయి | Leo news











