(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారని, ఒక వ్యక్తి మీద కోపంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ నాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇలాంటి సీఎం ప్రపంచంలో మరెక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతగా ..
జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అమరావతికి మద్దతు ఇచ్చి… ఇప్పుడు మాట తప్పారని అచ్చెన్న దుయ్యబట్టారు. మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన రోజున.. ఒకటే రాజధాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం నుండే ఉద్యమం
వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు అమర్చితే శ్రీకాకుళం నుంచే ఉద్యమిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాజధాని విషయంలో వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రతిపక్ష నేతగా అమరావతికి మద్దతు తెలిపి… ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Must Read ;- జగన్ ఢిల్లీ యాత్ర వెనుక అసలుసీక్రెట్ ఇదే!