రౌద్రం.. రణం.. రుధిరం.. ఇలా అంటే అర్థం కాకపోయినా రాజమౌళి ఆర్ఆర్ఆర్ అంటే సులువుగా అర్థమవుతుందేమో. ఈ సినిమాలో మెగాస్టార్, అమీర్ ఖాన్ లు కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం. మరి వీరు పోషించే పాత్రలు ఎలాంటివి అన్నది చూద్దాం. ఎస్.ఎస్. రాజమౌళికి ఈ సినిమా మరో ‘బాహుబలి’ లాంటిది. కరోనా రాకుంటే ఈపాటికే బాహుబలి ముస్తాబై ఉండేది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతటి భారీ సినిమాకు ఇంకా మెగా బలం కావాలని రాజమౌళి కోరకుంటున్నట్టు ఉంది. సినిమాని మరీ ఎక్కువ హైప్ చేయడం అనేది ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతుంది.
ఇప్పటిదాకా రాజమౌళికి అలాంటి పిరిస్థితి అయితే ఎదురుకాలేదు. మరో విషయం ఏమిటంటే మొట్టమొదటి సారిగా రాజమౌళి మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. బాహుబలిలో ఇద్దరూ ఉద్ధండులే అయినా దాన్ని మల్టీస్టారర్ మూవీ అనలేం. ఎందుకంటే రానా పోషించింది విలన్ పాత్ర కావడం కూడా ఒక కారణం కావచ్చు. మరి ఇలాంటి సినిమాలో చిరంజీవి, అమీర్ ఖాన్ ఎందుకనే సందేహం కూడా కలుగుతుంది. పైగా ఇందులో బాలీవుడ్ దిగ్గజం అజయ్ దేవ్ గణ్ కూడా నటిస్తున్నారు.
Also Read ;- రాజమౌళి ‘ఛత్రపతి శివాజీ’ గా సూపర్ స్టార్ ?
ఆ పాత్ర పరిచయం కోసమేనా?
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలే కీలకం. పోరాట పటిమ ఉన్న ఈ పాత్రలకు తగిన పరిచయం కూడా ఉంటే బాగుంటుందన్న ఆలోచన రాజమౌళికి వచ్చిందట. అందుకే ఈ పాత్రలను పరిచయం చేయడానికి కొందరు అగ్రనటులను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో ఈ సంప్రదాయం ఉంది. చిరంజీవి ‘సైరా’కు కూడా ఇది తప్పలేదు. పైగా సినిమా షూటింగులో ఉన్నప్పుడు మధ్య మధ్యలో అప్ డేట్స్ ఇవ్వడం కూడా రాజమౌళికి అలవాటు.
ప్రజల నోళ్లలో ఈ సినిమా పేరు నానుతూ ఉండాలి. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ పాత్రలను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఆయన ఇంతకుముందు ‘ఘాజీ’, ‘రుద్రమదేవి’ చిత్రాలకు తన వాయిస్ అందించారు. రాజమౌళి అడిగిన వెంటనే చిరంజీవి ఓకే చెప్పేశారట. ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలవుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఆయా హీరోల వాయిస్ లను ఎంచుకున్నారని, అందుకు ఆ హీరోలు కూడా అంగీకరించారని తెలిసింది. హిందీలో ఈ వాయిస్ ఓవర్ ను అమీర్ ఖాన్ తో చెప్పించనున్నట్లు తెలిసింది.
ఇక మలయాళంలో మోహన్ లాల్, కన్నడంలో శివరాజ్ కుమార్, తమిళంలో అజిత్ లను ఈ గళం కోసం ఎంచుకున్నారు. ఇందులో హీరోయిన్లుగా ఆలియాభట్, ఒలివియో మోరస్ లతో పాటు తాజాగా ఐశ్వర్యా రాజేష్ కూడా తోడైనట్టు తెలుస్తోంది. వీరితోపాటు అజయ్ దేవ్ గణ్ కు తోడుగా శ్రియ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను డిసెంబరు వెల్లిడించే అవకాశం ఉంది. మధ్య మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ కూడా వస్తున్నాయి. అది కావాలనే చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Must Read ;- గాయాలను లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్న తమిళ తల











