కరోనా చాలా విచిత్రమైనది. కొందరిని కబలిస్తుంది, మరికొందరిలో కరోనా వచ్చిపోయిన దాకలాలు కూడా కనిపించడం లేదు. ఇంకొందరు కాస్త ఇబ్బందిపడినా.. చివరికి కోలుకుని ప్రాణాలు దక్కించుకుంటున్నారు. ఇక దేశాల విషయంలో కూడా కరోనా మార్పుల గురించి తెలుసుకోలేక పరిశోధకులు తలలుపట్టుకుంటున్నారు. కొన్ని దేశాలను తన కబంద హస్తాలలో నలిపేస్తోంది, మరి కొన్ని దేశాలలో కాస్త శాంతించింది. అన్ని దేశాలలో, అందరిలో ఉన్న వైరస్ ఒక్కటే, కానీ అందులో ఎంతకిన్ని మార్పులు ఉంటున్నాయో కనిపెట్టడానికి పూనుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనల్లో కొన్ని వస్తుపోయే నిజాలు బయటపెట్టరు.
కరోనా తీవ్రతకు కారణాలివే..
అతి సాధారణంగా మొదలవుతున్న కరోనా, మెల్లగా తీవ్రంగా మారుతోంది. సకాలంలో చికిత్స తీసుకుని, జాగ్రత్తలు పాటించినా కూడా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవి కేవలం వయసు మళ్లిన వారిలో మాత్రమే అనుకుంటే పొరపాటే.. కొందరు మధ్యవయస్కులు, యువత కూడా చాలా కరోనా ధాటికి తట్టుకోలేకపోతున్నారు. మరి ఇంతటి పెను మార్పునకు కారణం వైరస్ జెనికల్ లక్షణాలు అంటున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా 5 రకాల జెనిటికల్స్ కరోనా తీవ్రతను పెంచుతున్నాయంటున్నారు. వైరస్‌లోని IFNAR2, TYK2, OAS1, DPP9 and CCR2 అనే జెనిటికల్స్ కరోనా తీవ్రతను పెంచుతున్నాయట. వైరస్‌లోని ఈ 5 రకాల జీన్స్‌లు రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేయడం ద్వారా వివిధ రాకలు జబ్బులకు కారణమవుతాయి. దీనికి తోడు ఊపిరితిత్తులపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లకు మూలాలు దొరికాయి
ప్రాంతమేదైనా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కరోనా ఎలా మనగలుగుతుందో చెప్పడం శాస్ర్తవేత్తలు పెను సవాలుగా మారింది. కరోనా జీన్స్ విధానం వల్లే ఇది సాధ్యమవుతోందని తెలిసినా స్పష్టత లేక పరిశోధకులు తలలు పట్టుకున్నారు. తాజాగా వెలువడిన ఎడిన్‌బర్గ్ పరిశోధనల ఫలితాల ప్రకారం కరోనా తీవ్రత కారకాలు కనిపెట్టినట్లు తెలుస్తుంది.
ఈ ప్రయోగాల ఫలితంగా చికిత్స విధానంలో మార్పులు చేపట్టడం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడవచ్చని పరిశోధకులు పేర్కోంటున్నారు. అంతేకాదు, ఈ జెనిటికల్స్ ఆధారంగా టీకా కనిపెట్టడంలో ముందంజ వేయచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వైరస్ జీన్స్ కనిపెట్టడం ద్వారా వాటి ప్రభావం ఆధారంగా చేసుకుని టీకాను రూపొందించడం ద్వారా కరోనా తీవ్రతను తగ్గించి, ఆరోగ్యం మెరపుపడేలా చేయచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Must Readv ;- అమెరికాలో ఫైజర్‌కు లైన్ క్లియర్











