యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన తర్వాత ఆయన క్రేజు, ఇమేజు అమాంతం పెరిగింది. దీంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సైతం ఇంట్రస్ట్ చూపించారు. అయితే.. ప్రభాస్ బాహుబలితో వచ్చిన క్రేజ్ దృష్ట్యా వేరే బ్యానర్ లో ఎందుకు చేయాలి అనుకున్నాడో ఏమో.. బాహుబలి తర్వాత చిత్రం సాహోని తన సొంత నిర్మాణ సంస్థ అయిన యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో చేసారు. దీంతో ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్న నిర్మాతలకు నిరాశే ఎదురైంది.
సాహో తర్వాత సినిమా అయినా ప్రభాస్ తో చేద్దామనుకుంటే.. తర్వాత సినిమా అయిన రాథేశ్యామ్ సినిమా కూడా సొంత నిర్మాణ సంస్థలోనే చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ కోసం వెయిటింగ్ తప్పలేదు నిర్మాతలకు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రభాస్ తో గతంలో మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ చేసారు. దశరథ్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ పర్ ఫెక్ట్ ఘన విజయం సాధించింది. దీంతో దిల్ రాజు మళ్లీ ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నారు. ప్రభాస్ కోసం సురేందర్ రెడ్డితో ఓ భారీ యాక్షన స్టోరీ రెడీ చేయించారు. ప్రభాస్ కథ విన్నాడు కానీ.. ఓకే చెప్పలేదు.
ప్రబాస్ తో సినిమా చేయాలనుకున్న మరో టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీస్. మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో రంగస్థలం.. ఇలా భారీ చిత్రాలను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ప్రభాస్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ప్రబాస్ కాంబినేషన్ లో సినిమా చేయాలనుకుంది. అయితే..ఈ సంస్థకు కూడా ప్రభాస్ నో చెప్పారు. నాగ్ అశ్విన్ తో చేస్తున్న మూవీని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ ఒక్క సంస్థతో తప్పా ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ వేరే భాషల నిర్మాణ సంస్థలే.
ఆదిపురుష్ మూవీకి బాలీవుడ్ ప్రొడ్యూసర్ టి.సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాత. సలార్ మూవీకి కన్నడ నిర్మాతలు. ఇలా.. వేరే భాషల నిర్మాతలకే సినిమాలు చేస్తున్నాడు కానీ.. తెలుగు నిర్మాతలకు సినిమాలకు ఇంట్రస్ట్ చూపించడం లేదు. కారణం ఏంటంటే.. ప్రభాస్ రెమ్యూనరేషన్ 80 కోట్లు అని. ఆయన సినిమా బడ్జెట్ 300 కోట్లు అని… అంత బడ్జెట్ పెట్టే నిర్మాతలకే సినిమాలు చేయాలనుకుంటున్నాడట. అందుకే.. దిల్ రాజు, మైత్రీ మూవీస్ కి నో చెప్పారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అదీ.. సంగతి..!
Muat Read ;- ప్రభాస్ కి ఇప్పుడు అదే పెద్ద సమస్య!











