May 5, 2026 6:25 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఉచితాలు..అనుచితాలే.. ఫ్రీ పథకాలపై కోర్టు ఆక్షేపణ

తమిళనాడులో ఎన్నికల సందర్భంగా పార్టీలు, నాయకులు ఇస్తున్న హామీలపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలతో కొందరు పౌరుల్లో సోమరితనం పెరుగుతోందనే కోణంలో న్యాయస్థానం ఆక్షేపించింది.

April 2, 2021 at 11:40 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళనాడులో ఎన్నికల సందర్భంగా పార్టీలు, నాయకులు ఇస్తున్న హామీలపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు వచ్చాయంటే.. దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పథకాల రూపకల్పన కంటే.. ఉచిత పథకాలపై దేశంలోని పార్టీలన్నీ దృష్టి సారిస్తున్న వేళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఉచిత పథకాల ద్వారా కొందరు పౌరుల్లో సోమరితనం పెరుగుతోందనే కోణంలో న్యాయస్థానం ఆక్షేపించింది.

అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ..

అయితే కేవలం తమిళనాడుకే ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా..అక్కడి పార్టీలు మాత్రమే ఉచిత వాగ్దానాలు చేస్తున్నాయనే అనే విషయానికి వస్తే..దేశంలోని పార్టీల్లో 90 శాతం పార్టీలు అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నాయి. ఆ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ, స్వీయ ఉపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల మెరుగుదల లాంటి విస్తృత ప్రయోజన విధానాలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయడం జరుగుతోంది. తమతమ ఇబ్బందుల నేపథ్యంలో ఓటర్లు కూడా అటువైపు ఆకర్షితులు కావడం, అధికారాన్ని కట్టబెడుతుండడంతో పార్టీలకు కూడా తప్పని సరిగా మారిందా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోపాటు భావి తరాలకు కనీస వసతుల కల్పన కూడా కష్టం అవుతుందని చెప్పవచ్చు. ఇందుకు వెనిజులా దేశాన్ని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో కొన్ని వ్యవస్థలు వెనిజులాతో పోల్చితే మెరుగ్గానే ఉన్నాయి. అయితే స్వతంత్ర వ్యవస్థల్లోనూ పాలకుల జోక్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో వెనిజులా అనుభవం ప్రస్తావించాల్సిన అంశమే.

సంపన్న నిక్షేపాలు..ఆకలి చావులు..

వెనిజులా 1920-1970 మధ్య కాలంలో ప్రపంచంలోనే చమురు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న దేశం.. అయితే ఇప్పుడు కప్పు కాఫీ ధర అక్కడ దాదాపు పది లక్షల బొలివర్లు. గత పదేళ్లలో ధరలు 155000 శాతం పెరిగాయి. నెలలో ఒకసారి మాంసం కొనాలంటే నెల జీతంలో 3వ వంతు ఖర్చు పెట్టాల్సిందే. రోజుకు 10సార్లు కరెంటు పోతుంది. ప్రతినెలా ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఆర్థిక వనరులు లేని దేశంలో ఈ పరిస్థితి వచ్చిందా అంటే..అదీ కాదు.. సంపన్న దేశంగా ఉండాల్సిన వెనిజులా.. ఇప్పుడు కోలుకోలేని స్థితికి చేరింది. 1 మిలియన్‌ బొలివర్స్‌ మన దేశ కరెన్సీలో దాదాపు రూ.39తో సమానం. అస్తవ్యస్త ఆర్థిక విధానాలే ఇందుకు దారి తీశాయి. చమురు విక్రయించిన ప్రభుత్వాలు అనుసరించిన అస్తవ్యస్త విధానాలు, ఉచిత పంపిణీ కార్యక్రమాలు, ప్రభుత్వం ద్వారా నిధులు పొదుపు చేసే వ్యవస్థ నిర్వీర్యం కావడం,అన్నీ ఉచితంగా రావడంతో ఉపాధి మార్గాలను పట్టించుకోకపోవడం, సంపద సృష్టి కొరవడం, బ్రెజిల్ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు ఆర్థిక నైపుణ్యం గల వ్యక్తులు సూచనలు పట్టించుకోలేదు. చమురు వెలికి తీసినందుకు భారీగా పన్నులు వసూలు చేసినా.. అవి అవినీతి పరుల చేతిలోకి వెళ్లాయి. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక ప్రపంచంలో వెనిజులా దేశానికి చెందిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలూ చాలా తక్కువ. ఎందుకంటే నైపుణ్యం, అంకిత భావం లేకపోవడం ప్రధాన కారణం. అంటే ప్రభుత్వాలు దేశ ప్రజలను ఆ పరిస్థితిలోకి నెట్టాయి. వీటన్నిటికీ ప్రధాన కారణాలు రెండే రెండు. స్వీయ నియంత్ర లేకుండా చేసిన ఉచిత హామీలు, పంపిణీలు ఒకటైతే  సంపద సృష్టి దిశగా పారిశ్రామిక, ఆర్థిక, ఉపాధి రంగాలను ప్రభుత్వాలు మెరుగుపర్చకపోవడం రెండో కారణం.

హామీలు తారస్థాయికి..

తమిళనాడులోని అంథియుర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న షేక్ దావూద్, సౌత్ మధురైలో పోటీ చేస్తున్న శరవణన్‌లు ఇచ్చిన హామీలూ రాజకీయపార్టీల వైఖరిని ప్రశ్నించేలా ఉన్నాయి. వీరిచ్చిన హామీలను చూస్తే.. ప్రతి ఇంటికీ రూ. పదిలక్షల రుణమాఫీ, ప్రతి రోజూ ఇంటికి లీటర్ మద్యం, బీర్, నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్‌ల వారీగా చంద్రమండలానికి తరలించడం, స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు, ఇంటిపనిలో మహిళలకు సాయంగా ఉండేలా ఉచిత రోబోల పంపిణీ, మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రోడ్డు పక్కన కాల్వ తవ్వించి ఇంటికి ఒక బోటు ఫ్రీ, ఎండవేడి నుంచి నియోజకవర్గాన్ని బయటపడేలా చేయడం కోసం 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండ నిర్మాణం, భూమి సేకరించి సాయంత్రం వేళ సేద తీరేందుకు కృత్రిమ సముద్ర బీచ్ సృష్టి, ఇంటికో ఐ ఫోన్ ఫ్రీ..ఇలా చాలా ఉన్నాయి. అయితే రాజకీయపార్టీలు ఇస్తున్న విచ్చలవిడి ఉచిత హామీలపై ప్రజలు ఆలోచించేందుకు ఈ హామీలు ఇచ్చినట్టు స్వతంత్ర శరవణన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో వాషింగ్ మెషిన్లు, ఫోన్లు ఇలా పలు పార్టీలు వస్తువులు ఫ్రీ అని ప్రకటించిన నేపథ్యంలో శరవణన్ ఈ హామీలు ఇచ్చారు.

దేశంలోని పార్టీలన్నీ జపిస్తున్న ఫ్రీ మంత్రం

తమిళనాడు మాత్రమే కాదు.. దేశంలోని పార్టీలన్నీ ఫ్రీ మంత్రాన్ని జపిస్తున్న నేపథ్యంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాకుండా ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన పై రాజకీయ పార్టీల దృష్టి పెట్టాలని సూచించడంతోపాటు ఉచిత పథకాల వల్ల ఏ పని చేయకపోయినా, ఎలాగైనా బ్రతికేయచ్చనే ఆలోచన ప్రమాదకరమైందని కోర్టు అభిప్రాయపడింది.ఇక అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కూడా. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక్కో అభ్యర్థి రూ.2‌0 కోట్లు ఖర్చు చేస్తున్నారని, వారు ఇచ్చిన తాయిలాలు తీసుకుని ఓటు వేసినప్పుడు ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా అని హైకోర్టు వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద తమిళనాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశంలోని అన్ని పార్టీలను ఆలోచింపజేయడంతోపాటు ఉచిత హామీలను ఆశిస్తున్న వారి ఆలోచనల్లోనూ మార్పు వస్తేనే ఆర్థిక ప్రగతి సాధ్యమనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో నిజమైన అర్హులకు, ఉచితమైన, లేదా ఉపశమన చర్యలు, చేయూత నిచ్చే విధంగా నిధుల కేటాయింపును ఎవరూ తప్పుబట్టరు. అదే సమయంలో ఆ చర్యలతోపాటు సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక విధానాల రూపకల్పన కూడా జరగాలి. అలా కాకుండా ఆల్ ఫ్రీ మంత్రం జపిస్తే..రానున్నకాలంలో అప్పుల ఊబిలో మరింత కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలు అధికారాన్ని అనుభవిస్తాయి..అదే సమయంలో ప్రభుత్వాలు చేసిన అప్పులు..ప్రజలు భరించాల్సి ఉంటుందనే అవగాహన కూడా కల్పించినప్పుడే విచ్ఛలవిడి ఫ్రీ పథకాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పవచ్చు.

Also Read:తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు!

Tags: andhraap newsEditorspickelection manifesto detailselection manifesto free schemeselection manifesto informationHigh Court Advocatehigh court advocates listhigh court articlehigh court at hyderabadhigh court case statushigh court case status hyderabadhigh court cause listhigh court chief justicehigh court coments on free schemes of parties manifestohigh court comments on free schemeshigh court comments on lrs telangana ap high court commentshigh court definitionhigh court hyderabadhigh court latets newshigh court of andhra pradeshhigh court of telanganahigh court of telangana case statushigh court updateslatest news cm kcrlatets newson election manifestotelanganatelugu newsthe leo news
Previous Post

నిరుద్యోగి సునీల్ కన్నుమూశాడు : పదిరోజుల క్రితమే సెల్ఫీ వీడియో

Next Post

అవన్నీ వదంతులే : సీఎస్ సోమేశ్

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

జీజీహెచ్ లో కరోనా రోగుల ఆకలి కేకలు

‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు ఏం చేస్తున్నాడు?

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

ఆత్మలతో కాదు.. అంతరాత్మతో మాట్లాడండి!

హ్యాపీ బర్త్ డే టు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్

Anchor Vishnu Priya Hot Stunnig Photos

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist