July 12, 2026 1:10 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నెలలో నాలుగు విలక్షణ తీర్పులు

భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత జస్టిస్ ఎన్వీ రమణ నెల రోజుల్లో సంచలన తీర్పులు ఇచ్చారు.

June 1, 2021 at 2:24 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత జస్టిస్ ఎన్వీ రమణ నెల రోజుల్లో సంచలన తీర్పులు ఇచ్చారు.ఈ తీర్పుల్లో చట్టం అమలు,హక్కుల పరిరక్షణ,సాక్ష్యాధారాలు తదితర అంశాలపై మార్గదర్శకాలు చేశారని చెప్పవచ్చు.ప్రతి కేసులో ఉండే పరిస్థితులు,వ్యక్తుల స్వభావాలు,నేర చరిత్ర,ఆధారాలను బట్టి తీర్పులుండే పరిస్థితి ఉంటుందని గతంలోనే చెప్పిన జస్టిస్ ఎన్వీ రమణ గత నెల రోజుల్లో ఇచ్చిన కీలక తీర్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందులో దిశానిర్దేశంగా మారిన నాలుగు కేసులు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.

సంజయ్‌కుమార్ రాయ్ వర్సెస్ యూపీ కేసు..

సంజయ్‌కుమార్ రాయ్ వర్సెస్ యూపీ కేసులో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.కొన్ని కేసుల్లో దర్యాప్తు,ట్రయల్ తీరు  పోస్టాఫీసులా మారకూడదని వ్యాఖ్యానించారు.సరైన ఆధారాల్లేకుండా ఎలా ప్రాసిక్యూట్ చేస్తారని ప్రశ్నించారు.ఈ కేసు వివరాల్లోకి వెళ్తే సంజయ్‌కుమార్ మరో వ్యక్తిని ఫోన్‌లో చంపేస్తామని బెదిరించాడనే ఫిర్యాదు పోలీసులకు అందింది.ఈ కేసు ట్రయల్ కోర్టు,హైకోర్టులో విచారణ జరిగింది.సంజయ్‌కుమార్‌కి శిక్ష పడింది.అయితే సంజయ్‌కుమార్ సుప్రీంను ఆశ్రయించడంతో పాటు హక్కులకు భంగం కల్గించడం,స్వేచ్ఛను హరించడాన్ని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ,న్యాయమూర్తి జస్టిస్ అనురుథ్ భోస్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో సాక్ష్యాలు లేవని,కనీస విచారణ కూడా దిగువస్థాయిలో జరగలేదని వ్యాఖ్యానించింది.సరైన ఆధారాల్లేకపోగా నిందితుడైన సంజయ్‌కుమార్ బాధితుడిగా చెబుతున్న వ్యక్తిని ఫోన్‌లో చంపేస్తామని బెదిరించాడంటూ తాము స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో విన్నామనే ఇద్దరు సాక్షులు చెప్పిన వివరాలే సాక్ష్యాలుగా చూపెట్టడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించలేదు.నిందితుడి హక్కులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని ఈ కేసులో మార్గనిర్దేశం చేశారు.హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడంతో పాటు వ్యక్తులకు ఉండే జీవించే హక్కును హరించే అధికారం న్యాయస్థానాలకూ లేదని వ్యాఖ్యానించింది.

Must Read ;- జస్టీస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం : కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారానికి సిద్ధంonline court casescourt cases online

ముందస్తు బెయిల్ కేసులో..

కాగా మరో కేసులో ముందస్తు బెయిల్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది.ముందస్తు బెయిల్ తిరస్కరించాల్సి వస్తే లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.అసాధారణ పరిస్థితుల్లోనే అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.నాథూ సింగ్ వర్సెస్ యూపీ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించే సమయంలో పిటిషనర్ వాదనలను,పరిస్థితిని గమనించాలన్నారు.చట్టాల్లో పేర్కొన్న భాష,అర్థం విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని,చట్టాలు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కోర్టులదే అన్నారు.తప్పుడు కేసుల నుంచి నిందితులను తప్పించే బాధ్యత కోర్టులపై ఉందని చెప్పడంతో పాటు,తప్పు చేసిన వారు చట్టంలోని కొన్ని అంశాల ఆధారంగా విచారణలో జాప్యం అయ్యేలా వ్యవహరించేందుకు,శిక్ష నుంచి తప్పించుకునేలా వ్యవహరించేందుకు అవకాశం ఇవ్వకూడదని కూడా వ్యాఖ్యానించింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ,న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌,జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఓ తీర్పునిచ్చింది.ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 438ని హైకోర్టు లేదా సెషన్స్‌ కోర్టులు సరళంగా అన్వయించుకోవాలని పేర్కొంది.సరైన కారణాలు లేకుండానే కోర్టులు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించలేదు.సరైన కారణం లేకుండా ముందస్తు బెయిల్ ఇస్తే నిందితులను 90 రోజులపాటు అరెస్టు నుంచి రక్షించినట్టు అవుతుందని,వాస్తవాలు,పరిస్థితుల ఆధారంగా ముందస్తు బెయిల్‌కు నిర్ణీత కాలాన్ని హైకోర్టు లేదా సెషన్స్‌ కోర్టు నిర్ణయించవచ్చునని సూచించింది.దర్యాప్తు సంస్థల ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటూనే,పిటిషనర్‌ ప్రయోజనాలు,రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను రక్షించేలా ఉత్తర్వులు ఉండాలని సూచించింది.ఈ కేసులో తీవ్రతను పరిగణనలోకి తీసుకొని నిందితుల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించి,దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.

సద్‌బిర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణ కేసు..

సద్‌బిర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణ కేసులో ట్రయల్ కోర్టు,హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టేసింది సర్వోన్నత న్యాయస్థానం.వరకట్నం డిమాండ్ చేయడం వల్లే మహిళ ఆత్మహత్య చేసుకుందని నమోదైన ఈ కేసులో నిందితుడైన సద్‌బిర్ సింగ్‌కు దిగువ న్యాయస్థానం శిక్ష విధించింది.దీనిపై నిందితుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాను నేరం చేశామని ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందని,బాధితురాలు ఏడాదిన్నరలోపే చనిపోయిందనే కారణంతోనే తనపై అభియోగాలు మోపారని పిటిషనర్ వాదించాడు.దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చట్టాల్లో పేర్కొన్న భాషను,సెక్షన్లను సరైన విధంగా అర్థం చేసుకోవాలని,లేని పక్షంలో చట్టాలు దుర్వినియోగం అవుతాయన్నారు.కేవలం సాక్షులు చెప్పిన వివరాల మేరకు నిర్దారణకు రావడం సరికాదని పేర్కొన్నారు.కొన్ని కేసుల్లో దూరంగా నివసిస్తున్నా,సంబంధం లేకుండా నిందితులుగా చేర్చుతున్నారని,నిందితుల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ట్రయల్ కోర్టులదేనని వ్యాఖ్యానించారు.

గుర్మిత్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో..

గుర్మిత్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో ట్రయల్ కోర్టులు,హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.ఇది కూడా వరకట్న వేధింపులకు సంబంధించిన కేసే.ఈ కేసులో 304-బి,వరకట్న వేధింపుల వల్ల మరణం,498-ఎ మహిళలపై వేధింపుల కేసును సమర్థించింది.నిందితులు చట్టపరమైన నిబంధనలను దుర్వినియోగం చేయడానికి అనుమతించవద్దని ధర్మాసనం హెచ్చరించింది.సద్‌బిర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణ కేసు,గుర్మిత్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసుల్లో రెండు విలక్షణమైన తీర్పులు ఇచ్చింది.ఈ రెండు కేసుల్లో,సెక్షన్ 304-బి ఐపిసి కింద విచారణకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించింది.

Must Read ;- సవాళ్లను ఎదుర్కొని, ప్రతిభను చాటుకుని.. సీజేగా ఎన్వీ రమణ

Tags: cji justice nv ramana typical judgmentsEditorspicktelugu news
Previous Post

ఆనందయ్య మందు ఆన్ లైన్ లో : నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

Next Post

బికినీ షో తో రెచ్చగోడుతోన్న బాలీవుడ్ బ్యూటీ

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మనిషికి ఎందుకీ తాపత్రయం?

Disha Patani Mind Blowing Hot Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చక్ర (రివ్యూ)

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

జగన్ రాజకీయ పులిహోర | CA Maheswara Rao on YS Jagan Strategy Behind New Districts Concept | Leo News

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist