October 29, 2026 6:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

అసమానం.. అజరామరం దిలీప్ కుమార్ నటన

దిలీప్ కుమార్.. ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన పేరిది. దిలీప్ కుమార్ .. ఒక పేరు కాదు .. ఒక అభినయ అస్త్రం అనే చెప్పాలి. అలాంటి దిలీప్ కుమార్ ఇక లేరు.

July 7, 2021 at 8:37 AM
in Bollywood, Cinema, Editors Pick, Tollywood
Special Story On Dilip Kumar
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Special Story On Dilip Kumar : 

మేఘాలు వచ్చివెళుతుంటాయి .. కానీ ఆకాశం ఎప్పటికీ ఉంటుంది. కాలాలు మారుతుంటాయి .. కానీ సూర్యచంద్రులు ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాగే వెండితెరపై ఎవరు ఎంతకాలం రాజ్యం చేసినా, నటన పరంగా దిలీప్ కుమార్ వేసిన ముద్ర చెదరకుండా అలాగే ఉంటుంది.

దిలీప్ కుమార్ .. ఒక పేరు కాదు .. ఒక అభినయ అస్త్రం .. అది ప్రేక్షకుల హృదయాలపై ప్రయోగించబడి చాలాకాలమే అయింది. ఇప్పటికీ అది తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. చిన్ని చిన్ని కళ్లతో .. నిర్మల మైన నవ్వుతో .. నిర్వచనానికి అందని అభినయాన్ని ఆవిష్కరించిన అరుదైన కథానాయకుడు ఆయన. నవరసాలను ప్రేక్షకుల మనసు పాత్రలో వడ్డించిన తిరుగులేని నటుడు ఆయన. దిలీప్ కుమార్ పేరును ప్రస్తావించకుండా బాలీవుడ్ సినిమా చరిత్రను చెప్పుకోవడం అసాధ్యం .. అది ఎవరూ కాదనలేని సత్యం.

1940 ద్వితీయార్థం నుంచి కథానాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం అప్రతిహతంగా సాగింది. ఆ తరం నటులకు ఆయన ఒక స్ఫూర్తి. ఆ తరువాత తరాలవారికి ఆయన ఒక పుస్తకం. పోటీని తట్టుకోలేక పారిపోయేవారు తప్పకుండ చదువుకోవలసిన పాఠం. ఒక ఆర్టిస్ట్ తాను డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం తేలికే .. అవతల పాత్ర డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఆ అర్థానికి తగినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడమే చాలా కష్టం. ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ లోని లోపాలు బయటపడేది కూడా ఇక్కడే. ఆర్టిస్టులు ఇక్కడే పాస్ మార్కులు తెచ్చుకోవలసి ఉంటుంది.

నిజమైన నటుడు ‘కట్’ చెప్పేవరకూ పాత్రలో నుంచి బయటికి రాడు .. తెరపై ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుడిని ఆ దృశ్యంలో నుంచి బయటికి రానీయడు. నటనంటే తన పాత్ర .. తనచుట్టూ ఉన్న పాత్రలను దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ చెప్పడం కాదు. ఆ పాత్రలతో పాటు పరిసరాలను ఆ సన్నివేశంలోకి తీసుకోవాలి .. అక్కడి ప్రకృతిని ఆ సన్నివేశంలోకి ఆవాహన చేయాలి. అప్పుడే ఆ సన్నివేశం సహజంగా ఆవిష్కృతమవుతుందని నమ్మిన నటుడు దిలీప్ కుమార్. అందుకే ఆయన అభినయం అనుభూతి ప్రధానంగా కనిపిస్తుంది. ఎల్లలు ఎరుగని నటుడిగా ఇప్పటికీ ఆయన పేరే వినిపిస్తోంది.

తెరపై కనిపించే ఏ పాత్ర అయినా ప్రేక్షకుల చూపుల నుంచి తప్పించుకోలేదు. అందువల్లనే పాత్రలో జీవం ఉందా? లేదా? అనే విషయం వాళ్లు వెంటనే గ్రహించేస్తారు. కథ .. నిజమని ప్రేక్షకులు అనుకోవాలంటే, ఆ కథలో వాళ్లను భాగస్వాములను చేయాలంటే పాత్రలలో నటులు ఒదిగిపోవాలి .. తేనెలో తీపిలా ఇమిడిపోవాలి. దిలీప్ కుమార్ నటించిన ఏ పాత్రను పరిశీలించినా ఇదే విషయం అర్థమవుతుంది. ఆయన అంతగా జనాదరణ పొందడానికిగల కారణం స్పష్టమవుతుంది.దిలీప్ కుమార్ తొలి సినిమా ‘జ్వార్ భాటా’ పరాజయం పాలైనా ఆయనేం కుంగిపోలేదు.  ఓటమిని వాయిదా వేయబడిన గెలుపు మాదిరిగానే ఆయన భావించాడు. అదే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాడు.

అప్పట్లోనే ఆయన తనదైన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయడం .. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ను ఆవిష్కరించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దిలీప్ కుమార్ నడకలోని ప్రత్యేకత .. కనుబొమలు ఎగరేస్తూ డైలాగ్స్ చెప్పే తీరు .. కళ్లు చిట్లిస్తూ .. పెదాలను విరుస్తూ భావాలను ఆవిష్కరించే విధానానికి ఎంతోమంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా డైలాగ్స్ కన్నా ఎక్స్ ప్రెషన్స్ కి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. కథాకథనాలతో పాటు పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అందువల్లనే ఆయన పాటల్లో అధికశాతం సూపర్ హిట్లే ఉంటాయి. కథ ఏదైనా .. పాత్ర ఎలాంటిదైనా ఆయన అభిమానుల నుంచి రెండే మాటలు బయటికి వచ్చేవి .. అవే .. అద్భుతం – అసమానం.

50 దశకంలో దిలీప్ కుమార్ (Dilip Kumar) చేసిన ‘దీదార్’ .. ‘అమర్’ .. ‘దేవదాస్‘ .. ‘మధుమతి’ చిత్రాలు ఆయనలోని విలక్షణ నటనకు అద్దం పడతాయి .. అర్థం చెబుతాయి. ఆయన పోషించిన ఆ తరహా పాత్రల కారణంగానే ‘ట్రాజెడీ కింగ్’ అంటూ అభిమానులు పిలుచుకున్నారు. ఇక 60 వ దశకం ఆరంభంలో వచ్చిన ‘మొఘల్ ఎ ఆజమ్’ దిలీప్ కుమార్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది. సలీమ్ – అనార్కలి అమరప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన అభినయాన్ని అభిమానులు ఒక తీపిజ్ఞాపకంగా గుండె అరల్లో .. మనసు పొరల్లో దాచుకున్నారు.

స్టార్ హీరోగా దిలీప్ కుమార్ ఒక వెలుగు వెలుగుతున్న కాలంలోనే ఆయన ‘సైరాభాను’తో ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆమె కోల కళ్లతో కుర్రకారును ఊరిస్తూ, నీరాజనాలు అందుకుంటోంది. దిలీప్ కుమార్ – సైరాభాను ప్రేమ .. పెళ్లిపీటల వరకూ వెళ్లింది. అభిమానులంతా ఆశించినట్టుగానే వాళ్లిద్దరూ ఒకటయ్యారు. అందాల జంటగా .. అన్యోన్య దంపతులుగా అభినందనలు అందుకున్నారు.

దిలీప్ కుమార్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘కోహినూర్’ .. ‘గంగ జమున’ .. ‘లీడర్’ .. ‘రామ్ ఔర్ శ్యామ్’ ..’సంఘర్ష్’ .. ‘ దిల్ దియా దర్ద్ లియా’ వచ్చి చేరాయి. వైవిధ్యభరితమైన ఆ చిత్రాలతో ఆయన అఖండ విజయాలను అందుకున్నారు. ఆ తరువాత ఆయన ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లోను ఊత్సాహంగా నటించారు. దర్శక నిర్మాతగానూ కొన్ని ప్రయోగాలు చేశారు. రాజకీయాల్లో ప్రవేశించి నాయకుడిగా తనవంతు సేవలను సమాజానికి అందించారు.

ఇలా నిలువెత్తు నటనకు నిర్వచనమై .. వ్యక్తిత్వం విషయంలో అజరామరమై నిలిచారు. ఈ కారణంగానే దిలీప్ కుమార్ ను పద్మభూషణ్ .. పద్మవిభూషణ్ .. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు సత్కరించుకున్నాయి. వెండితెరపై .. అభిమానుల గుండె తెరపై పదిలంగా నిలిచిన ఆయన స్థానానికి మరింత వన్నె తెచ్చాయి.

– పెద్దింటి గోపీకృష్ణ

Must Read ;- మకుటాయమానం దిలీప్ ‘మొఘల్-ఏ- ఆజమ్’

Tags: Dilip KumarDilip Kumar affairsdilip kumar agedilip kumar age 2020Dilip Kumar birthday specialdilip kumar date of birthdilip kumar health 2021dilip kumar health conditiondilip kumar health problemsdilip kumar health todayDilip Kumar love lifedilip kumar storyEditorspickspecial story of dilip kumarSpecial Story On Dilip Kumar
Previous Post

బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత

Next Post

పనికోసం ప్రయత్నించు.. ప్రస్తులుంటే నన్ను సంప్రదించు!

Related Posts

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

by లియో డెస్క్
October 28, 2026 5:54 pm

ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలను ఆపాలని, ఏకగ్రీవాలను...

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

by లియో డెస్క్
October 28, 2026 4:21 pm

రాయలసీమ రాజకీయ చరిత్రలోనే ఊహించని సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని...

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

by లియో డెస్క్
October 28, 2026 3:57 pm

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, కుండపోత...

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

by లియో డెస్క్
October 27, 2026 5:46 pm

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా...

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

by లియో డెస్క్
October 27, 2026 5:42 pm

పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist