ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీకే వెచ్చిస్తుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇంకా చెప్పాలంటే ఆటవిడుపు కోసం ఫ్యామిలీతో కలిసి ఏడాదికి రెండు, మూడు పర్యాయాలు సుదూర ప్రాంతాలకు విహార యాత్రలు చేయడం ఆయనకు పరిపాటి.
ఇందులో భాగంగా ఎప్పడూ చూడని దేశాలను, అందమైన కొత్త లొకేషన్లను ఎంచుకుంటుంటారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడంతో దాదాపు 8 నుంచి, 9 నెలల పాటు స్టార్ హీరోలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మహేష్ బాబు కూడా ఇంతకాలం పాటు ఇంటి వద్దనే ఉంటూ అరుదుగా దొరికిన ఆ సమయాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులకే కేటాయించారు. కాగా ఈ తడవ దీపావళిని మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి దుబాయిలో గడిపారు. ఇందులో భాగంగా దీపావళికి రెండు రోజులు ముందుగా తన సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి దుబాయికి వెళ్లిన మహేష్ అక్కడ ఎంతో ఎంజాయ్ చేశారట.
దుబాయిలో నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ ఇంటిలో వీరంతా దీపావళి వేడుకలను చాలా ఆనందంగా జరుపుకున్నారట.విహార యాత్రలు, సెలబ్రేషన్స్ మించిన గొప్పవేమీ లేవు అని నమ్రత సంతోషంగా చెబుతోంది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమైనట్లు సమాచారం. ఆ మేరకు తెల్లవారు జామున అదే సమయానికి నమ్రత సోషల్ మీడియాలో .. ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ అంటూ ఫొటోతో కూడిన ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలో మహేష్ ఎంతో అందంగా కనిపిస్తూ.. పెరుగుతున్న వయసు కనిపించకుండా పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నారు.
Must Read ;- మరో చిన్నారి ప్రాణం కాపాడిన సూపర్ స్టార్ మహేష్ బాబు
మొదటి షెడ్యూల్ అమెరికాలో ఉండకపోవచ్చు ?
కరోనా కారణంగా చాలాకాలం పాటు సినిమా పరిశ్రమ స్తంభించిపోయి అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇటీవలే కొన్ని చిత్రాల షూటింగులు తిరిగి ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సర్కార్ వారి పాట చిత్రం చిత్రీకరణ ! ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ప్రేక్షకాభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నూతన ఏడాది 2021 జనవరిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలవుతుందని పరిశ్రమలో వినిపిస్తోంది.
వాస్తవానికి కథకు అనుగుణంగా కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మొదటి షెడ్యూల్ అమెరికాలో జరపాలని అనుకున్నారు కూడా. ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా కరోనా కేసులు అధికంగా ఉండటంతో ఇండియా షెడ్యూల్ తర్వాతే అమెరికాకు వెళతారని కూడా మరో వార్త పరిశ్రమలో వినిపిస్తోంది. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తారని అంటున్నారు. ఆయన సరసన కీర్తి సురేష్ నాయికగా నటించనుండగా..పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read ;- దీపావళికి తమిళనాట రిలీజ్ కానున్న మహేష్ సినిమా