Actress Devayani Busy In Tollywood :
తరాలు మారుతున్నాయి .. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి .. అందుకు తగినట్టుగానే కథలు మారుతున్నాయి. ఒకప్పుడు ఇటు హీరోకైనా అటు హీరోయిన్ కైనా తల్లిగా నటించాలంటే సీనియర్ కేరక్టర్ ఆర్టిస్టులను తీసుకునేవారు. అలా సూర్యకాంతం .. నిర్మలమ్మ .. అన్నపూర్ణ తల్లిపాత్రల్లో ఇమిడిపోయారు. ఆ తరువాత కాలంలో శారద .. వాణిశ్రీ .. సుజాత వంటివారు కూడా తల్లి పాత్రల్లో మెప్పించారు. ఇక ఇప్పుడు ట్రెండ్ మరింత మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె తల్లి కూడా యంగ్ గానే కనిపించాలి .. అందంగానే అనిపించాలి.
కథలో ముఖ్యమైనదిగా కనిపించే తల్లి పాత్రల కోసం సీనియర్ హీరోయిన్లను తీసుకోవడమనేది త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో తెరపై తమదైన గ్లామర్ తో మెరిసిన సీనియర్ హీరోయిన్లను తన కథల్లో ఆయన ప్రవేశపెట్టారు. వాళ్ల క్రేజ్ కూడా ఆ సినిమాకి మరింత వెయిట్ ఇచ్చేలా చూసుకున్నారు. అలా ఆయన తెలుగు తెరకి దూరమైన చాలామంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చేలా చేశారు. తన సినిమాల్లోని ఆ పాత్రలు వారికి మంచి పేరు తెచ్చేలా .. పారితోషికం పెరిగేలా చేశారు.
ఇటీవల కాలంలో కొరటాల కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఆయన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. నదియా .. సుకన్య .. సితార .. ఆమని .. దేవయాని వంటి సీనియర్ హీరోయిన్స్ కి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’లో దేవయాని పోషించిన ఒక ముఖ్యమైన పాత్ర, ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘అరవింద సమేత’లోను విభిన్నమైన పాత్రలో కనిపించిన దేవయాని, తాజాగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమాలోను ఒక కీలమైన పాత్రను పోషించింది. ఈ తరహా పాత్రలతో తెలుగు తెరపై దేవయాని బిజీ అవుతుండటం విశేషం.
Mustr Read ;- వళ్ళును విల్లులా వెనక్కి వంచిన టాలీవుడ్ సీనియర్ నటి











