టాలీవుడ్ లేటెస్ట్ అందం నిధి అగర్వాల్. నాగచైతన్య సవ్యసాచి తో కథానాయికగా టాలీవుడ్ లో వెండితెర ప్రయాణం మొదలు పెట్టిన ఆమె.. ఆ మూవీ రిజల్ట్ తో నిరాశ చెందినప్పటికీ.. అవకాశాలు మాత్రం ఆగిపోలేదు. పైగా గ్లామర్ ఒలికించడంలో ఆమె ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి.. కాస్తంత పెద్ద సినిమాల్లోనే ఆఫర్స్ దక్కుతున్నాయి.
పూరీ జగన్నాథ్, రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఆమె రోల్ చిన్నదే అయినప్పటికీ.. ఆమె గ్లామర్ దానికి బాగానే యాడ్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో .. ప్రస్తుతం పవర్ స్టార్ తో హరిహరవీరమల్లు అనే జానపద చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే.. నిధి అగర్వాల్ తాను అందాలకు నిధే కాదు.. మానవత్వానికి పెన్నిధి కూడా అని నిరూపించుకుంది.
ప్రస్తుతం నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల రీత్యా.. కష్టాల్లో ఉన్నవారి కోసం డిస్ట్రిబ్యూట్ లవ్ అనే చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పింది. దాంతో కరోనాతో పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నవారికి సహాయం అందనుంది. దీంతో నిధి అగర్వాల్ మానవత్వానికి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమెను ఇన్పిరేషన్ గా తీసుకొని మరికొంత మంది టాలీవుడ్ కథానాయికలు సహాయం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నారు.
Must Read ;- పోలీసులకు నటుడు చరణ్ రాజ్ ఆహార సరఫరా











