ఆహా కోసం.. స్టార్ హీరోయిన్ సమంత రంగంలోకి దిగడం.. సామ్ జామ్ అనే టాక్ షో చేస్తుండడం తెలిసిందే. సమంత తనదైన స్టైల్ లో షోను రన్ చేస్తూ.. ఆకట్టుకుంది. ఇప్పటి వరకు వచ్చిన టాక్ షోలకు భిన్నంగా ఉన్న ఈ టాక్ షోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, తమన్నా.. లను ఇప్పటి వరకు తన షోలో ఇంటర్ వ్యూ చేసింది సమంత. ఇప్పుడు హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తన షోకు ఇన్వైట్ చేసింది. రీసెంట్ గా షో షూట్ జరిగింది.o

రకుల్ విషయానికి వస్తే… కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం.. తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. డి దే ప్యార్ దే, అయ్యరి తదితర హిందీ చిత్రాల్లో నటించి అక్కడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక సమంత టాక్ షో విషయానికి వస్తే.. రకుల్ పసుపు పూల డ్రెస్ వేసుకుని ఈ టాక్ షోలో పాల్గొంది.
Must Read ;- లేటెస్ట్ ఫోటోస్ తో మెస్మరైజ్ చేస్తోన్న అందాల సమంత

ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో కాలేజీ డేస్ గురించి, ఫిట్ నెస్ గురించి అలాగే ఫేమ్, సక్సస్ గురించి.. వాటిని ఎలా డీల్ చేయాలి తదితర ఆసక్తికరమైన విషయాల గురించి సమంత ఆడగడం.. వాటికి రకుల్ తెలివిగా సమాధానం చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్ కు అనూహ్యమైన స్పందన రావడం ఖాయం అనిపిస్తుంది. రకుల్ తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈవిధంగా రకుల్ ఓ వైపు టాలీవుడ్ మరో వైపు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Also Read ;- సమంత, రాశి.. ఒకే డ్రెస్, ఒకే విరుపు.. భలే మెరుపు