బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫైనల్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే.. ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే.. బిగ్ బాస్ విన్నర్ ఇతనే అంటూ లీకులు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖి విన్నర్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఏమైందో ఏమో కానీ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాగే జరగనుందా అనేది ఆసక్తిగా మారింది. ఫైనల్ విన్నర్ విషయంలో తటస్థ ఓటర్లే కీలకం.
ఆయా కంటెస్టంట్ల పర్ ఫార్మెన్ బట్టి ఓటర్లు అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంది. అయితే.. అభిజిత్ ఇప్పటి వరకు 11 సార్లు నామినేట్ అయ్యాడు. అయినప్పటికీ అతని అభిమానులు విపరీతంగా ఓటు వేయడంతో ఫైనల్ వరకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు జరిగిన సీజన్ లో ఏం జరిగిందో చూస్తే.. విన్నర్ అభిజిత్ అనిపిస్తుంది. ఇంతకీ అది ఏంటంటే.. బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్,, బిగ్ బాస్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యారు. అయినప్పటికీ టైటిల్ కైవసం చేసుకున్నారు.
ఇప్పుడు అభిజిత్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. ఈ లాజిక్ ప్రకారం ఈసారి విన్నర్ ఖచ్చితంగా అభిజితే అనిపిస్తుంది. అభిజిత్ అభిమానులందరూ ఈ లెక్క ప్రకారం విన్నర్ గా నిలిచేది అభిజితే అంటూ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదే కనుక జరిగితే.. అభిజీత్ కి ఫ్రైజ్ మనీ భారీగానే వస్తుంది అంటున్నారు. కారణం ఏంటంటే.. అభిజిత్ కి వారానికి రూ.4 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ లెక్క ప్రకారం అభిజీత్ విజేత కాకుంటే.. అతనికి అందే అమౌంట్ 60 లక్షలు. ఇక విన్నర్ గా నిలిస్తే మాత్రం మరో 50 లక్షలు ప్రైజ్ మనీ వస్తుంది కనుక మొత్తం మీద బిగ్‌బాస్ హౌజ్ నుంచి రూ.1.10 కోట్లతో అభిజీత్ దక్కించుకుంటాడు. లీకులు అయితే అభిజితే విన్నర్ అని చెబుతున్నాయి. మరి.. ఈ లీకులు నిజమౌతాయో లేదో చూడాలి.
Must Read ;- బిగ్ బాస్ విషయంలో.. వర్మ శ్రీకాంత్.. ఇద్దరిలో ఎవరి జోస్యం ఫలిస్తుంది.?