రాష్ట్రంలో రాజకీయ వైరం మరింత ముదిరేలా ఉంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం .. అంతా సద్దుమణిగిందనుకుంటూ ఉండగానే బీజేపీ నేతలు ఒకరి తరువాత ఒకరు టీఆరెఎస్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. నిన్న అధ్యక్షుడు బండి సంజయ్, నేడు ఎంపీ సోయం బాపురావులు కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్ళి ఏం చేశారు.. కేంద్ర మంత్రులను కలిసి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారో స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రంపై యుద్దం చేస్తాం.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి వెంటనే ఢిల్లీ వెళ్ళి ఏకాంతంగా కేంద్ర మంత్రులను ఎందుకు కలిసారో స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్ళి దండాలు పెట్టినంత మాత్రానా రాష్ట్రంలో అధికార పార్టీ చేసిన అవినీతితో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు.
Must Read ;- ప్రజలకిచ్చిన మాట.. హస్తినలో మరచిన కేసీఆర్!
ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక శిక్షణ
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నేడు ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి.. ప్రజల్లో బీజేపీపై నమ్మకం కలిగించాలంటే తీసుకోవాల్సిన అంశాలపై ముఖ్యనేతలు చర్చించారు. నగర శివార్లలో ఏర్పాటు చేసిన ఈ శిక్షకులకు శిక్షణా తరగతుల్లో పార్టీ కేడర్‌ను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బండి సంజయ్ పార్టీని దూకుడుగా ముందుకు నడిపిస్తున్నారు. పదునైన విమర్శలు, మాటలతో టీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇదే ఫోర్స్‌ను క్షేత్ర స్థాయిలో కూడా ప్రయోగించేలా అంతా సిద్ధంగా ఉండాలంటూ ఈ సమావేశంలో సూచించినట్టు తెలిసింది. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపునకు క్షేత్ర స్థాయి నుండి మంచి స్పందన వచ్చేలా .. గ్రామీణ ప్రాంతాల్లో కూడా దూకుడుగా వెళ్ళేందుకు ఎలా ప్రిపేర్ చేయాలన్న దానిపై ఈ సమావేశంలో సూచనలు చేశారు. శిక్షకులు త్వరలో జరగబోయే శిక్షణా తరగతుల్లో బీజేపీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. టార్గెట్ 2023ను ఎలా అమలు చేయాలనే దానిపై రాష్ట్ర స్థాయి నాయకులు దిశా నిర్దేశం చేశారు.
కొత్తవారితో కలిసి పోయేలా..
ఇక రాష్ట్రంలో పార్టీలో చేరిన కొత్తవారితో కలిసి పోయేలా శిక్షణా తరగతుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు నాయకులు. కొత్తగా వచ్చిన వారికి పార్టీ సిద్ధాంతాలు చెప్పడంతో పాటు పార్టీలో ఎలా మెలగాలి.. పాత వారితో కలుపుగోలుగా ఉంటూ ఉమ్మడిగా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలన్న దానిపై సూదీర్ఘంగా చర్చించారు. కొత్త, పాత తేడా లేకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని అధికారంలో తేలవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని శిక్షకులకు సూచించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ పట్ల సానుకూల దృక్పథం ఏర్పండిందని .. ప్రజల్లో ఆ నమ్మకాన్ని అలానే కొనసాగించేలా నిరంతరం ప్రజల్లోనే ఉండేలా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు , నాయకులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. ప్రతి యేటా జరిగే శిక్షణా తరగతులే అయినా ఈ ఏడాది నుండి పార్టీ గమనం కాస్త వేగంగా .. అధికారానికి చేరువ అయ్యేలా ఈ శిక్షణా తరగతులు ఉండేందుకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. మరి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన సూచనలు క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు నాయకుల నుండి ఏ మాత్రం సహకారం అందుతుంది… రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును ఏమేరకు అంది పుచ్చుకుంటారో చూడాలి.
Also Read ;- గల్లీ ఎఫెక్ట్.. ఢిల్లీ పాలి‘ట్రిక్స్’