టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. త్రివిక్రమ్ రాసిన పదునైన మాటలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. తమన్ సంగీతంలోని పాటలు అనేక రికార్డులను సృష్టిస్తున్నాయి. పాటలే కాకుండా సినిమా కూడా టాలీవుడ్ లో కొత్త రికార్డులను నెలకొల్పింది. అప్పటి వరకు ఉన్న బన్నీ రికార్డులను తానే తిరగ రాశాడు. అతడి సినీ జీవితంలోనే మర్చిపోలేని ఒక మంచి సినిమాను ఇచ్చాడు త్రివిక్రమ్.
ఇక ఈ సినిమా టాలీవూడ్ లోనే కాకుండా మలయాళం కూడా మంచి హిట్ అయ్యింది. అక్కడ కూడా బన్నీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. వారు బన్నీని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. రీసెంట్ గా ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని తమిళ్ లో ‘వైకుంఠపురం’ పేరుతో డబ్బింగ్ చేశారు. సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా సినిమాను రిలీజ్ చేశారు. తమిళ్ లో కూడా సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూసిన తమిళ్ ప్రేక్షకులు పాజిటివ్ గా ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ నటన, డాన్సులు బాగున్నాయని, త్రివిక్రమ్ కథను నడిపించిన తీరు అమోఘం అని అంటున్నారు.
Must Read ;- త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్టు అల్లు ‘రామాయణం’
ఇందులోని సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, సాంగ్స్ అన్నీ బాగా నచ్చాయని, మొత్తంగా సినిమా అద్భుతంగా ఉందని వారు వరుస ట్విట్లు చేస్తున్నారు. అలాగే ‘పుష్ప’ సినిమా కోసం కూడా మేము ఎదురుచూస్తున్నామని బన్నీ తమిళ్ ఫాన్స్ అంటున్నారు. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ తమిళనాట కూడా అభిమానులను సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఏదిఏమైనా ఒక తెలుగు సినిమా సౌత్ ఇండియాలో ఉన్న ప్రేక్షకులందరికీ నచ్చడం నిజంగా గ్రేటే.
Also Read ;- బన్నీకి కృతఙ్ఞతలు తెలిపిన ఉదయపూర్ ఎయిర్ పోర్టు సిబ్బంది