ఈ పుట్టినరోజు మరింత స్పెషల్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే.. ఇటీవలే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించారు. ఈ నెల 31న రజనీకాంత్ తన పార్టీ పేరు పార్టీ గుర్తు ఎనౌన్స్ చేయనున్నారు. ఎప్పటి నుంచో రజనీ రాజకీయల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరికకు తగ్గట్టుగా రాజకీయాల్లోకి వస్తున్న ఈ టైమ్ లో పుట్టినరోజు రావడంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు.
Dearest Friend @rajinikanth
Happy 70th Birthday & Wish you a wonderful life ahead.Wish you All Success in ur endeavor in politics.U have won millions of hearts through Ur unique style & I trust U will also tread Ur unique path in serving those millions! Stay Blessed!Lots of love! pic.twitter.com/hnCK7Adkgw— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2020
తమిళనాడులో రజనీ పుట్టినరోజు వేడుకలు భారీ స్ధాయిలో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. రజనీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ.. నా స్నేహితుడు రజనీకాంత్ కి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో అద్భుతమైన విజయాన్నిసాధించారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా సాధించాలి. తన స్టైల్ తో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. రాజకీయాల్లో కూడా రాణిస్తారని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి రజనీకాంత్ కి శుభాకాంక్షలు తెలియచేసారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియచేసారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటూ అభినందనలు తెలియచేసారు. అలాగే విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మలయాళ స్టార్ మోహన్ లాల్ తదితర సినీ ప్రముఖులు రజనీకాంత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.
Must Read ;- రజనీకాంత్ చరిత్ర సృష్టిస్తారా..? చరిత్రలో కలిసిపోతారా..?











