మాఫియా డాన్వా పాక్ లో ఉన్నా ఇంకా ఆయన బెదిరింపులు బాలీవుడ్ లో కొనసాగుతున్నాయి. ఆయన స్థానంలో ఆయన ప్రియురాలి గళం ఈ విషయంలో ప్రముఖంగా వినవస్తోంది. వార్తల్లో హాట్ టాపిక్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కొత్త ప్రియురాలు పాకిస్తానీ నటి, గాయని మెహవిష్ హయత్. దావూద్ ఇండియాలో ఉన్నంత కాలం బాలీవుడ్ స్టార్స్ తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేశాడు ‘ సింహాసనం ‘ సినిమాలో హీరోయిన్ గా నటించిన మందాకినితో దావూద్ కి సంబంధం ఉందని అప్పట్లో వార్తలు వస్తుండేవి. బొంబాయి బాంబు పేలుళ్ల తర్వాత పాకిస్తాన్ లో రహస్యంగా తల దాచుకున్నాడు దావూద్. అండర్ గ్రౌండ్ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న దావూద్ ఈ పాకిస్తానీ సెక్సీ హీరోయిన్ మెహవిష్ కోసం బయటికి వచ్చాడు.
మెహవిష్ హయత్ తల్లి కూడా సినిమా నటే. చిన్న వయసులోనే సింగర్ గా, ఐటెం సాంగ్స్ గర్ల్ గా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వచ్చింది మెహవిష్. క్రమేపీ టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది.’ ఇన్షా అల్లాహ’ సినిమాలు ‘జవానీ ఫిర్ నహీ ఆయేగీ ‘ సినిమాల్లో నటిస్తున్నప్పుడు దావూద్ కంట్లో పడింది. దావూద్ గర్ల్ ఫ్రెండ్ గా పాపులర్ అయింది . పాకిస్తానీ చిత్ర పరిశ్రమ కూడా దావూద్ కనుసన్నల్లోనే నడుస్తోంది. దావూద్ రెకమెండేషన్స్ తో మెహవిష్ నెంబర్ వన్ హీరోయిన్ అయింది . ఆమె నటించిన ‘ జవానీ ఫిర్ నహి ఆయేగీ ‘ సినిమాలు పంజాబ్ నహీ జావూగె ” సినిమాలు పాకిస్తానీ చిత్ర రంగంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు..
మెహవిష్ కోసం దావూద్ చేయనిది లేదు. ఆస్తిపాస్తులు, సినిమాలు, స్టార్ డమ్, అంతెందుకు పాకిస్తానీ ప్రభుత్వం సివిలియన్స్ కి ఇచ్చే అత్యంత గౌరవ ప్రదమైన అవార్డు ” తంగా – ఏ – ఇమిటిఅజ్ ” ని ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ చేతుల మీదగా మెహవిష్ కి ఇప్పించాడు దావూద్. దావూద్ అండదండలు చూసుకుని బాలీవుడ్ మీద రెచ్చిపోయి కామెంట్స్ చేసింది మెహవిష్. బాలీవుడ్ పాటలన్నీ పాకిస్తానీ సంగీతం నుంచి కాపీ కొడుతున్నారని, వాళ్ళ మీద ఇంటర్నేషనల్ కాపీ రైట్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది మెహవిష్.
షారూఖ్ ఖాన్ నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ” బార్డ అఫ్ బ్లడ్ ” చూసి ” షారుఖ్ నీకు దేశభక్తి ఉంటే చూపించుకో.. అంతే తప్ప పాకిస్తాన్ ని చెడుగా చూపిస్తే ఊరుకోం ” అని సోషల్ మీడియా సాక్షిగా హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం దావూద్ పాకిస్తాన్ లో లేడని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం, మెహవిష్ హయత్ ప్రేమాయణం బయటికి వచ్చింది. అయితే తనకి దావూద్ తో ప్రేమ వ్యవహారాలు లేవని, ఇదంతా కుట్ర అని స్టేట్మెంట్ ఇచ్చింది మెహవిష్.










