మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. నిన్నటి నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. మార్చికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి కొత్త సినిమా మొదలెట్టాలి అనుకుంటున్నారు చిరంజీవి. ఆచార్య తర్వాత చిరు మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నాడు. అయితే.. చిరు వరుసగా సినిమాలు చేస్తుండడంతో యంగ్ డైరెక్టర్స్ ఆయనతో సినిమా చేయడం కోసం కథలు రెడీ చేసుకుంటున్నారు.
ఆల్రెడీ కొంత మంది యంగ్ డైరెక్టర్స్ చిరంజీవికి కథ చెప్పడం జరిగిందట. నితిన్ తో భీష్మ సినిమాని తెరకెక్కించి.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ కుడుముల చిరంజీవి కోసం ఓ స్టోరీ రెడీ చేసాడట. ఇది పక్కా ఎంటర్ టైనర్ అని.. కథ వింటే ఆయన వెంటనే ఓకే చెబుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. త్వరలోనే చిరంజీవికి వెంకీ కథ చెప్పనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. వెంకీ కుడుముల.. సూపర్ స్టార్ మహేష్ బాబుకి కథ చెప్పాడని వార్తలు వచ్చాయి. వెంకీ చెప్పిన స్టోరీ మహేష్ కి బాగా నచ్చిందట.
మహేష్ తో వెంకీ కుడుముల మూవీ దాదాపు కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. భీష్మ సినిమా తర్వాత వెంకీకి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ ని బాగా డీల్ చేయగలడు అని భీష్మ సినిమాతో నిరూపించుకోవడంతో వెంకీతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరి.. వెంకీ కుడుముల మహేష్ తో సినిమా చేయనున్నాడా.? లేక చిరంజీవితో సినిమా చేయనున్నాడా..? లేక వీరిద్దరితో కాకుండా వేరే హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.
Must Read ;- దుబాయ్ లో మొదలైన నితిన్ మూవీ