నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి పరిధిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ చంద్రబాబు హాయంలోని గత టీడీపీ ప్రభుత్వంపై ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై జగన్ సర్కారు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… అమరావతిలో తమకేమీ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పంతం నెగ్గించుకునే దిశగా సాగుతున్న జగన్ సర్కారు.. ఈ వ్యవహారంపై ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది.
మూడు వారాలకు విచారణ వాయిదా
అమరావతి పరిధిలో ఇన్ సైడర్ ట్రేగింగ్ జరిగిందని, దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగన్ సర్కారు ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం పక్కనపెడితే… ఈ వ్యవహారంలో హైకోర్టు ప్రస్తావించిన అంశాలపైనే సుప్రీంకోర్టు దృష్టి సారించనున్నట్లుగా తెలుస్తోంది.
హైకోర్టు ఎం చెప్పింది?
అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లుగా చంద్రబాబు తన అనుకూలురకు ముందుగానే సమాచారం ఇచ్చి… అతి తక్కువ ధరలకే భూములు కొనిపించినట్లుగా జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సన్నిహితులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు కూడా అమరావతిలో భూములు కొన్నారన్నది జగన్ సర్కారు వాదన. దీనిపై పక్కా ఆధారాలు లేవని ఇదివరకే హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే తన పంతం నెగ్గించుకునే దిశగా జగన్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బలు తప్పవా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- బాబు తీసుకొస్తే!.. జగన్ తరిమేస్తున్నారు!