Heroine Anandhi :
తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతుంటారు. వారిలో తెలుగు అమ్మాయిల శాతం చాలా తక్కువ. అందుకు కారణం తెరపై గ్లామరస్ గా కనిపించే విషయంలో తెలుగు అమ్మాయిలకు కొన్ని పరిధులు ఉండటమే. అందువలన అభినయం విషయంలో ఢోకా లేకపోయినా, అందాల ఆరబోత విషయానికి వచ్చేసరికి అభ్యంతరాలు ఉండేవి. అందువలన పరభాషా కథానాయికలకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అభినయం సంగతి ఎలా ఉన్నప్పటికీ అందానికి మొదటి మార్కు ఇస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో కేవలన నటనను నమ్ముకునే స్వాతి రెడ్డి .. అంజలి .. ముందుకు సాగారు. ఇక ఈషా రెబ్బా మాత్రం గ్లామర్ విషయంలో ఓ రెండు అడుగులు ముందుకు వేసిందనే చెప్పాలి. ఈ కారణంగానే కొంత సమయం పట్టినప్పటికీ కుదురుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మరో తెలుగు అమ్మాయి తెలుగు తెరకి వచ్చింది. అయితే తెలుగులో చేయడం ఈ అమ్మాయికి కొత్తేమీ కాదు. తమిళంలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుని, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో మళ్లీ ఇక్కడికి వచ్చింది .. ఆ అమ్మాయి పేరే ‘ఆనంది’
Heroine Anandhi :
‘ఈ రోజుల్లో‘ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆనంది, ఆ తరువాత ‘బస్ స్టాప్’ సినిమాను చేసింది. చక్కని కనుముక్కుతీరుతో ఆ అమ్మాయి యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. కలువల్లా విచ్చుకున్నట్టుగా ఉండే కళ్లతో కుర్రాళ్ల హృదయాలపై చూపుల లిపిలో ఏవేవో రాసింది. అలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో అక్కడికి వెళ్లింది .. చాలా తక్కువ కాలంలోనే బిజీ అయింది. జీవీ ప్రకాశ్ కుమార్ జోడీగా ఎక్కువ సినిమాలు చేసింది. ఇటీవల ‘జాంబి రెడ్డి‘ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో ఆనందికి మళ్లీ ఇక్కడ అవకాశాలు పెరుగుతున్నాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ రెడీ అవుతోంది. సుధీర్ బాబు సరసన చేసిన ఈ సినిమాతో, ఆమె ఇక్కడ బిజీ అవుతుందేమో చూడాలి.
Must Read ;- జాంబిరెడ్డి హీరోకి షాకింగ్ రెమ్యూనరేషన్











