కరోనా నిబంధనలు అమలు విషయంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు దిక్కారణ కింద తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావుకు కోర్టు ధిక్కారణ నోటీసులను జారీ చేసింది. కరోనా పరీక్షలపై మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంతో ఈమేరకు అత్యున్నత న్యాయ స్థానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను అన్ని రాష్ట్రాలు తప్పకుండా పాటించాలని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. కరోనా టీకా వచ్చేవరకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది. అయితే ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈక్రమంలో హైదరాబాద్‌లో కరోనా నిబంధనలు అమలుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రేటర్‌హైదరాబాద్‌లో భౌతిక దూరం, మాస్కులు వంటి నిబంధనలు సరిగా అమలు కావడంలేదని పేర్కొన్నది. కరోనా నిబంధనలు, అమలుకు సంబంధించిన జీవో 64ను జీహెచ్ఎంసీకి అప్పగించడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే ఆ జీవో 64 అమలు విషయాన్ని పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.
Must Read ;- ఎన్టీఆర్‌ని భుజాన ఎత్తుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్!











