విక్టరీ వెంకటేష్ – సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందిన చిత్రం నారప్ప. ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయాలని ప్రయత్నించారు కానీ.. కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో అంచనాలను అందుకోలేకపోయింది. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఎంతో కష్టపడి చేసిన నారప్ప సినిమా ఇలా నిరాశ పరచడంతో వెంకీ బాగా డీలాపడ్డారు. దీంతో దృశ్యం 2 సినిమా విషయంలో అలా జరగకూడదు అనుకున్నారని వార్తలు వచ్చాయి.
వెంకీ – మీనా జంటగా నటించిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది దృశ్యం 2. దీనికి మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చాలా తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. ఆలస్యం అయ్యింది. అయితే.. నారప్ప అనుభవంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో బాగా ఆలోచించి థియేటర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇంతకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పటికీ.. దానిని క్యాన్సిల్ చేసుకుని మరీ దృశ్యం 2 చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఇంకా చెప్పాలంటే.. దసరాకి దృశ్యం 2 ధియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే.. దసరా రేసు నుంచి దృశ్యం 2 చిత్రం తప్పుకుంది. తాజా వార్త ఏంటంటే.. థియేటర్లో కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలిసింది. వెంకీ థియేటర్లో రిలీజ్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సి వస్తుందట. అందుచేత ఈసారి ప్రమోషన్ బాగా పెంచాలని.. ఖచ్చితంగా ఓటీటలో విజయం సాధించాలని ట్రై చేస్తున్నారని సమాచారం. నారప్ప ఓటీటీలో మెప్పించలేకపోయింది. మరి.. దృశ్యం 2 అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి.
Must Read ;- ఎఫ్ 3 సెట్లో బన్నీ.. వెంకీ, వరుణ్ లతో ముచ్చట్లు











