సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలామందే ఉన్నారు. కరోనా కాలంలో కొంతమంది ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు. అయినా ఇంకా చాలమంది క్యూలో ఉన్నారు. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. మాస్ ఫాలొయింగ్ ఉన్న ఈ హీరోకి ఆ తర్వాత సరైన హిట్ రాలేదు. కార్తికేయ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
కార్తికేయ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా కార్తికేయకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మాయి ఎవరు ఏమిటన్నది ఇంకా తెలియలేదు. కార్తికేయ అధికారికంగా ప్రకటిస్తే తప్ప వివరాలు బయటికి రావు. సక్సెస్ లు దూరమవడంతో ఇటు హీరోగానూ అటు విలన్ గానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కార్తికేయ. ప్రస్తుతం అతను ‘రాజా విక్రమార్క’ అనే సినిమా చేస్తున్నాడు.
ఇది కాకుండా యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమా కూడా అంగీకరించాడు. వధువు కార్తికేయకు సమీప బంధువుల అమ్మాయేనని తెలుస్తోంది. సమీప బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. వధువు మాత్రం సినిమా హీరోయిన్ మాదిరిగా అందంగా ఉంది. యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, రానా దగ్గుబాటిల సరసన కార్తికేయను కూడా చేర్చవచ్చు. అయినా పెళ్లికాని ప్రసాదులు సినిమా రంగంలో ఇంకా చాలామందే తేలతారు.
Must Read ;- నయనతార పెళ్లికి ముహూర్తం దగ్గరలోనే!