‘ఉప్పెన’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ‘ఉప్పెన’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా సినిమా రిలీజ్ అవ్వలేదు. కాని ఇప్పటికే విడుదలైన పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను గుర్తించి తన తదుపరి సినిమా కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అడ్వాన్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే అగ్రిమెంట్ ప్రకారం బుచ్చిబాబు రెండో సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనే చేయాలి. ఇదే విషయం బుచ్చిబాబు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు తెలియజేశాడని టాక్. రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేసి, మూడో సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తానని చెప్పారట బుచ్చిబాబు. అయితే అందుకు ఆ సంస్థవారు ఒప్పుకోలేదని సమాచారం. వెంటనే బుచ్చిబాబు తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేశాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాకు వివిధ ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయని, కాని ఈ సినిమాను ఎట్టి పరిస్థితిల్లో సినిమా థియాటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు తెలియజేశారు. ఉప్పెన ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Must Read ;- మల్దీవ్స్ లో బికినీ తో సందడి చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్











