కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం తెలిసిందే. కేంద్రప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. దీనికి కొంత మంది నిర్మాతలు ఆమోదం తెలపగా.. కొంత మంది నిర్మాతలు.. ఇలా చేయడం వలన నష్టమే తప్పా లాభం లేదని.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేస్తేనే బాగుంటుందన్నారు. అయితే.. సంక్రాంతి నుంచి కొత్త సినిమాల రిలీజ్ లు ఉంటాయి. థియేటర్లకు పూర్వ వైభవం వస్తుంది అనుకుంటే.. సంక్రాంతికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని సంక్రాంతికి ప్లాన్ చేసిన పెద్ద సినిమాలు సమ్మర్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

అయితే.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ అయితే వచ్చింది కానీ.. ఈ సినిమా రిలీజ్ కూడా డౌటే అనుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లకు రాయితీలు కల్పించడం.. థియేటర్ల ఓనర్స్ కి లోన్లు కూడా ఇస్తామని చిత్ర పరిశ్రమ పై వరాలు కురిపించడంతో థియేటర్లను ఓపెన్ చేయడానికి మాంచి ఊపు వచ్చిందని చెప్పచ్చు.
దీంతో మాస్ మహారాజా నటిస్తున్న క్రాక్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేయనున్నారని ట్విట్టర్ ద్వారా రివీల్ చేసారు. తమన్ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. డైరెక్టర్ మలినేని గోపీచంద్ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ చేసారు. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ నటిస్తుంది. సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమా క్రాక్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన క్రాక్ అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. మాస్ మహారాజా సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- బల్లేగా తగిలావే బంగారం అంటున్న క్రాక్











