కాపులు కాకపై ఉన్నారా?
జగన్ రెడ్డి పాలనలో ఏపీలోని కాపులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? వారు రాజకీయంగా వెనుకపడ్డారన్న భావనలో ఉన్నారా? సొంత ఎజెండాలతో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా? జాతీయ పార్టీలో వైపు ఈ సారి కాపు నేతలు అడుగులు వేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సామాజీక న్యాయం, సమన్యాయ కోసం ముందుకొచ్చిన ప్రజారాజ్యం, జనసేన పార్టీల పరిస్థితి, అధికార, ప్రతిపక్ష వైసీపీ, టీడీపీలో కాపుల మనుగడ వంటి వాటితో పాటు 2024 లో కాపు కార్యచరణపై పార్టీలకు అతీతంగా నేతలు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ లు, మేధావులు హైదరాబాద్, కాకినాడ, విశాఖలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరస సమావేశాల సారం.. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీలతో సంబంధం లేకుండా కాపు నాయకులు, ప్రముఖులు విశాఖపట్నంలోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. మొత్తంగా జగన్ పాలనలో కాపులకు జరుగుతున్న అన్యాయం, రాజకీయంగా, సామాజీకంగా తీసుకోవాల్సిన స్టెప్స్ వంటి వాటిపై చర్చించినట్లు తెలుస్తోంది. కాపులను ఓటుబ్యాంకుగానే చూస్తున్నారని, పదవులు విషయం జరుగుతున్న అన్యాయంపై కలిసికట్టుగా తీసుకోవాలని నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చలు సాగాయన్నట్లు సమాచారం.
బీజేపీ దోస్తీ కోసమేనా!??
ఇటీవల కాపులు అధికారపార్టీకి దూరంగా ఉంటున్నారు. అలానే వైసీపీ ప్రభుత్వంలో కాపులు తీవ్ర అణిచివేతకు గురౌతున్నారన్న భావనలో కూడా నేతలున్నారు. విశాంత్ర ఐఏఎస్, ఐపీఎస్ల్లో కూడా ఇవే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాపు నేతలు బీసీ, ఎస్సీ వర్గాలను కలుపుకుని ఫోరం ఫర్ బెటర్ ఏపీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి పోరాడాలని భావిస్తున్నారు. భవిష్యుత్ కార్యచరణను ముందుకు తీసుకుపోయేందుకే విశాఖలో కాపు ప్రముఖులందరూ సమావేశం అయ్యారు. గంట శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావుతోపాటు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు, మాజీ డీజీపీ సాంబశివరావు తదితర ముఖ్యలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాపు కార్పోరేషన్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, కాపులకు అన్యాయం జరుగుతుందని పైకి చెపుతున్నారే కాని తెరవెనుక ప్లాన్ వేరే ఉందని చర్చ జరగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీ, కమ్మలకు టీడీపీ ప్లాంట్ ఫామ్స్ ఉన్నాయి. కానీ కాపులు దారేటు అన్నదాంట్లో క్లారిటీపైనే ఈ సమావేశాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఏపీ పూర్వ అధ్యక్షుడు కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణకు ఆ పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో జాతీయపార్టీ, దేశంలో అధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ వైపు కాపుల పయనంపైనే ప్రధానంగా, విస్తృతంగా చర్చ సాగినట్లు సమాచారం.
Must Read:-వైసీపీని రోడ్డుమీద తిరగనివ్వమంటూ నినాదాలు! మంత్రి వెల్లంపల్లిని తాకిన ప్రజావ్యతిరేక సెగ!!











