నేడు భద్రత .. భద్రత .. అంటూ గగ్గొలు పెడుతున్నారు !
కర్ణుడి చావుకు పదివేల కారణాలంటారు ! చరిత్ర చెబుతున్న నిజం కూడా..!! కానీ జగన్ అండ్ కో, ఫ్యాన్ పార్టీ చరిత్ర ఏపీలో కనుమరుగయ్యే రోజు కూడా చాలా దెగ్గల్లోనే ఉంది. అష్టదరిద్రాలను ప్రజలపైకి వదిలి .. బూతుల మంత్రులతో నీచమైన భాషను మాట్లాడిస్తారు. ఎంత నీచమంటే .. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ స్థాయిలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు బూతుల దండకాన్ని చదవడం చూడలేదు. బాగా వాడే ప్రజాప్రతినిధులకు బోనస్ లిచ్చి మరి ఎంకరేజ్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ తిట్టే మంత్రులను తిట్టేవారికి పార్టీలో ఒక ప్రత్యేక స్థానాన్నిచ్చి ప్రోత్సహిస్తారు.
అదే నేడు జగన్ కొంపముంచుతోందా!
అందులో ఎటువంటి అనుమానం లేదు. అదే జగన్ కొంప నేడు ముంచుతోంది. రాష్ట్ర ఆదాయాన్ని హరించి, ఆస్తులను తాకట్టుకు చేర్చి, ఆర్థికంగా కోలుకోలేని స్థితికి ఏపీని తీసుకొచ్చారని జగన్ రెడ్డి పై ఇప్పటికే ప్రజలు రగిలిపోతున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సాక్షిగా చందబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దీంతో రాష్ట్రమంతా కోపావేశాలతో ఊగిపోయారు. మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, ద్వారంపూడి, అంబటి ల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చెప్పులతో కొట్టిమరి నిరసన వ్యక్తం , ఎమ్మెల్యేపై దాడి చేస్తారని ఇంటలిజెన్సీ రిపోర్ట్ ను బేస్ చేసుకుని ఉన్నఫలంగా వారికి భద్రత పెంచింది జగన్ రెచేశారు. చంద్రబాబుకు జరిగిన పరాభావాన్ని గుర్తు తెసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ప్రముఖు స్పందించి, ముక్తం కంఠంతో ఖండించారు. అలానే ప్రజలే తిరగబడి బూతుల మంత్రులపైడ్డి ప్రభుత్వం. ఏకంగా ఒక్కొక్క బూతు ప్రజాప్రతినిధి గతంలో ఉన్న 1+1 ఉన్న భద్రత ఏకంగా 4+4 చేసి కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
సీన్ అర్థమయ్యే .. జాగ్రత్త పడుతున్నారా?
ఎస్ .. ఖచ్చితంగా భవిష్యత్తు అరచేతులో కనిపించింది కాబట్టే .. ఆ బూతు ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచారు. అధికారం ఉంది కదా .. అని విచ్చవిడిగా ప్రవర్తిస్తే .. ప్రజలు ఒక్కసారిగా తిరగబడతారని నేడు తత్వం బోధపడింది జగన్ రెడ్డికి. ప్రజాస్వామ్యం కన్నెర్ర చేస్తే .. ప్రభుత్వాలు .. పోలీసులు కోపాగ్నిలో తగలబడి పోతారని చరిత్ర చెప్పిన పాఠాలే కదా! మరి ఆ ఇంగితం గ్రహించలేకపోయింది అధికారపార్టీ. నేడు తలలుపట్టుకని వ్యక్తగత భద్రత కొరకు పాకులాడుతోంది. నాడు చంద్రబాబుకు ఉన్న భద్రతను పూర్తిగా తగ్గించి, దాడికి ప్రయత్నించారు. కానీ ప్రజాస్వామ్యంలో అందరికి సమాన హక్కులుంటాయని కోర్టు గుర్తు చేయడంతో ఆవిషయంలో జగన్ రెడ్డికి భంగపాటు తప్పలేదు.
Must Read ;- దివాలకు దరిదాపుల్లో ఏపీ ప్రభుత్వం!











