దేశంలోని అన్నివర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌కు శ్రీకారం చుట్టారు. భారతావని వ్యాప్తంగా ఆ నెలలో జరిగిన కీలకాంశాలను ప్రస్తావిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా వివిధ అంశాలు తన ప్రసంగంలో ఉండేలా చూస్తారు. అందులో భాగంగానే ఆదివారం మోదీ మన్‌కీ బాత్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ ను ప్రస్తావించారు. కుళ్లిపోయిన కూరగాయలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని సగర్వంగా ప్రశంసించారు.
మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే..
హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని స్థానిక కూరగాయల మార్కెట్ తన బాధ్యతలను నెరవేర్చే విధానాన్ని చదవడం కూడా నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. కూరగాయల మార్కెట్లలో చాలా కారణాల వల్ల కూరగాయలు చెడిపోతాయని మనం అందరం చూశాం. ఈ కుళ్లిపోయిన కూరగాయలు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయి. వీటి ద్వారా అపరిశుభ్రత కూడా వ్యాపిస్తుంది. కానీ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ ఇలా రోజువారీ కూరగాయలను విసిరి వేయకూడదని నిర్ణయించుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Must Read ;- టీమిండియా పోరాటం స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
ఇదో నవకల్పన శక్తి..
కూరగాయల మార్కెట్‌తో సంబంధం ఉన్న ప్రజలు వీటితో విద్యుత్తును సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. వ్యర్థ కూరగాయల నుండి విద్యుత్తును తయారు చేయడం గురించి మీరు ఎప్పుడైనా విని ఉంటారు. ఇది నవ కల్పన శక్తి. గతంలో బోయినపల్లి మార్కెట్లో ఉన్న వ్యర్థాల నుండి నేడు సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుండి బంగారం తయారు చేసే దిశగా ప్రయాణం అని కొనియాడారు.
ఇదో అద్భుతమైన ప్రయత్నం..
అక్కడ ప్రతి రోజు 10 టన్నుల వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఒక ప్లాంట్‌లో సేకరిస్తారు. ప్లాంట్ లోపల ఈ వ్యర్థాల నుండి ప్రతిరోజూ 500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. సుమారు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ కాంతే కూరగాయల మార్కెట్‌కి వెలుగుని ఇస్తుంది. అక్కడ ఉత్పత్తి అయిన జీవ ఇంధనం నుండి ఆ మార్కెట్లోని క్యాంటీన్‌లో ఆహారాన్ని తయారు చేస్తారు. ఇది అద్భుతమైన ప్రయత్నం కదూ !అంటూ మోదీ ప్రశంసించారు.
నా ప్రియమైన దేశవాసులారా! “జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః” అని ఆర్యోక్తి. అంటే బిందువు, బిందువు కలిసి కుండను నింపుతాయి. మన ఒక్కో ప్రయత్నం… మన సంకల్పాన్ని పూర్తి చేస్తాయి. అందువల్ల మనం 2021 లో ప్రారంభించిన లక్ష్యాలను మనమందరం కలిసి నెరవేర్చాలి. కాబట్టి ఈ సంవత్సరాన్ని సార్థకం చేయడానికి మనమందరం కలిసి అడుగులేద్దాం. మీ సందేశాన్ని, మీ ఆలోచనలను మీరు ఖచ్చితంగా పంపుతూ ఉండండి. వచ్చే నెలలో మరోసారి కలుద్దాం.. అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
Also Read ;- వ్యాక్సిన్‌లో భారత్‌దే పైచేయి










