పెళ్లయిన తర్వాత మెగా డాటర్ నిహారికలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె పెళ్లయి దాదాపు నెల రోజులైంది. హనీమూన్ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంది. ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కొత్త జంట కాబట్టి నెల రోజుల సెలబ్రేషన్ కూడా గ్రాండ్ గా చేసుకుంది. ఈ సందర్భంగా తమ సెలబ్రేషన్ కు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసింది నిహారిక.
ఆమె షేర్ చేసిన వీడియోలో ఎంతో ఉత్సాహభరితంగా కనిపించింది. ఆ వీడియో చూసిన వారంతా తెగ ఎంజాయ్ చేశారు కూడా. ఆమె గెంతులు వేయడం, ఫ్లిప్ కొట్టడం కూడా ఆకట్టుకుంది. ఇక గ్లామర్ కు కూడా కొదవలేదు. అందరూ నిహారికది ఎరేంజ్డ్ మ్యేరేజ్ అనుకుంటుంటారు.. నిజానికి వీరిది ప్రేమ వివాహం. 2015 నుంచి వీరి మధ్య ప్రేమ నడిచింది. ఓ జిమ్ కి నిహారిక వెళ్తుంటే చైతన్య అక్కడ ఆమెను కలిసేవాడట. మొత్తానికి వీరి ప్రేమ కథ సుఖాంతమైంది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లోనూ నిహారిక నటిస్తోంది.
Must Read ;- మెగా ఫ్యామిలీ నుంచి తెరపైకి మరో హీరో.. !











