Nimisha Sajayan – South Indian Actress Of The Year :
అందం అంటే మలయాళ కుట్టిలదే. అందుకే దక్షిణాదిలో ఎవరైనా హీరోయిన్ కోసం వెతుకుంటే మలయాళ చిత్రసీమ వైపే చూస్తారు. సాయిపల్లవి, కీర్తి సురేష్, ప్రియమణి, నయనతార.. ఇలా ఎందరో మలయాళ భామలు వెండి తెరపై వెలిగిపోయారు. తాజాగా నిమిషా సంజయన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మధ్య కాలంలో మలయాళంలో ఆమె హవా సాగుతోంది. ఏ ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాల్లో మూడు హిట్. పైగా ఆమె మంచి నటిగానూ గుర్తింపు పొందింది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నయాట్టు, మాలిక్ సినిమాలకు మంచి టాక్ వచ్చింది.
వన్ చిత్రం అంత గొప్పగా లేకపోయినా నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫాహద్ ఫాజిల్ నటించిన ‘మాలిక్’లో ఆమె నటన ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టింది. దక్షిణాది నిర్మాతలు, హీరోలు కూడా ఇప్పుడు నిమిషా వైపు చూస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ నటిగా నిమిషా మారిపోయింది. 2017లో ఆమె చిత్ర రంగ ప్రవేశం చేసింది. మాలిక్ లో సహనటుడు దిలీప్ పోతన్ దర్శకత్వం వహించిన ‘తొండిముదలం ద్రిక్షక్షియం’ చిత్రం ద్వారా ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో అతిరథ మహారథులున్నా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తర్వాత జోజు జార్జ్ తో ‘చోళ’, షేన్ నిగమ్ తో ‘ఈడ’, టోవిన్ థామస్ తో ‘ఒరు కుప్రసిధా పాయన్’ చిత్రాలు చేసింది. అవన్నీ ఒక ఎత్తు ఈ ఏడాది విడుదలైన చిత్రాలు ఒక ఎత్తు అనే చెప్పాలి. ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’లో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. నటనకు అవకాశమున్న పాత్ర వస్తే ఎలా మెప్పించాలో ఆమెకు బాగా తెలుసు. పరిపూర్ణమైన నటన ఎలా ఉంటుందో నిమిషా నిరూపించింది. అందుకే ఈ ఏడాది ఉత్తమ దక్షిణాది నటి ఎవరంటే నిమిషా పేరు చెప్పే పరిస్థితి వచ్చింది. మున్ముందు ఈ నటి మరెన్ని అద్బుతాలు చేస్తుందో చూడాలి. ప్రస్తుతం మలయాళ చిత్రాలకే నిమిషా పరిమితమైంది.
Must Read ;- డబ్బు కోసమే మలయాళ నటి రేవతి మాస్టర్ ప్లాన్?











