కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఈయన చరిత్ర తెలుసుకుంటే.. చరిత్ర అంటే ఏదో టూకీగా కాదు.. ఎప్పుడు ఏ క్షణాన ఎలా మాట్లాడారు.. ఎప్పుడు ఏ స్టెప్ తీసుకున్నారు.. ఎప్పుడు ఏ టర్న్ తీసుకున్నారు.. అన్నీ డీటెయిల్‌గా పరిశీలిస్తే.. మైండ్ గేమ్ అంటే ఏంటో అర్ధం చేసుకోగలరు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అదే ఆయన ఫార్ములా.. ఒకప్పుడు పెద్దాయన పీవీ నరసింహారావు ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయకుండా కామ్‌గా ఉండిపోతే మౌనమే ఆయన వ్యూహం అనుకున్నారు. అలాగే కేసీఆర్‌కి ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. కాళ్లు, చేతులు ఆడటం లేదు. ఈ బీజేపీ తన కొంప ముంచేలా ఉందని భయపడుతున్నాడు. అందుకే అన్నీ వదిలేసి.. వెళ్లి మొక్కారు.
రేపు బీజేపీ బలహీనపడితే..
రేపు బీజేపీ బలహీనపడితే.. మళ్లీ రజనీకాంత్ క్రాఫ్ పైకి ఎగరేసినట్లు తల పైకెగరేసి బీజేపీయా.. దాని మొహమా.. ఈ కేసీఆర్ ముందు ఏవీ పనికిరావంటూ ఓ పంచ్ డైలాగ్ విసురుతారు. అప్పుడు అందరూ మళ్లీ చప్పట్లు కొడతారు. అలాగే ఉంటాయి కేసీఆర్ వ్యూహాలు. మొన్న అన్నది నిన్న పట్టించుకోరు.. నిన్న అన్నది అసలే గుర్తు పెట్టుకోరు. ఆ రోజు పని కావాలంటే ఏదనాలంటే అదే అంటారు. అలాగే ఫాలో అయిపోతారు.
ఇప్పుడు బీజేపీ పెద్దలకు తెలంగాణ కావాలే.. కేసీఆర్‌కు అధికారం పోకూడదు. అందుకే మీకు కావాలంటే ఎంపీ సీట్లు వదిలేస్తా.. అసెంబ్లీ నాకు వదిలేయండి.. నన్ను ఆగం చేయకండి.. కావాలంటే పైకి తిట్టుడు కామన్‌గా నడిపిద్దాం.. నా సీటు కిందకు మాత్రం నీళ్లు తేకండి.. నిద్రపోతున్న కేసులను లేపి.. నన్ను జైలుకు పంపాలనే ఆలోచనలు చేయకండని బతిమాలుకున్నట్లే అనిపిస్తోంది.
Must Read ;- కేసీఆర్ 2.0.. రెండేళ్లలోనే ఎదురీత మొదలైందే
ఇద్దరూ కాంప్రమైజ్ అయితే..
అందుకే కేసీఆర్ లొంగిపోయారనే ప్రచారం జరుగుతుండగానే.. బండి సంజయ్‌కి ఢిల్లీ పిలుపు రావడంతో.. అందరూ ఆసక్తిగా చూశారు. ఇప్పుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి.. ఈ కేసీఆర్ ఎత్తులన్నీ మాకు తెలుసు.. వాటికి పడం అంటూ దబాయిస్తున్నారు. అంటే వారిద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ కుదిరినట్లే ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ లేకుండా పోతుంది. ఇద్దరూ కాంప్రమైజ్ అయితే.. ఏదో ఒక రాజకీయం నడిపించుకుంటూ బతికేయొచ్చు.. అదీ సంగతి.
మొత్తం మీద దుబ్బాక, గ్రేటర్ దెబ్బల తర్వాత కేసీఆర్‌కు భవిష్యత్ చక్రం కనపడిపోయింది. అందుకే జాతకం దెబ్బ తింటుందని అర్ధమయ్యే .. బాస్ ఢిల్లీకి పోయి పని పూర్తి చేసుకుని వచ్చినట్లే కనపడుతోంది. మరి గులాబీ, కమలాల మధ్య జరిగే ఈ డ్రామా ఎలా నడుస్తుందో చూడాలి మరి.
Also Read ;- ఆపరేషన్ కమలం.. చిక్కిన మరో ఇద్దరు?