Odisha Police Arrest YCP Key Leader Malla Vijaya Prasad :
వైసీపీలో పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడుతున్న వైనం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏపీలోని అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతలు పెను వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి వారి జాబితాలో విశాఖ ఉత్తర మాజీ ఎమ్మెల్యే, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మళ్ల విజయ ప్రసాద్ కూడా చేరిపోయారు. ఇప్పటిదాకా వెలుగు చూసిన వైసీపీ నేతల అక్రమాల్లో కెల్లా మళ్ల విజయ ప్రసాద్ పాల్పడ్డ కుంభకోణం భారీగానే చెప్పాలి. ఏకంగా రూ.1,200 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తున్న విశాఖ చిట్ ఫండ్ కుంభకోణంలో మళ్ల విజయ ప్రసాద్ కీలక నిందితుడిగా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భాగంగా ఒడిశా పోలీసులు మళ్ల విజయ ప్రసాద్ ను విశాఖలోనే అరెస్ట్ చేసి ఒడిశా తరలించారు. అరెస్ట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఒడిశా పోలీసులు విశాఖ నగర పోలీసుల సహకారం తీసుకుని మరీ మళ్ల విజయ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు.
కేసు ఏమిటంటే..?
విశాఖ చిట్ ఫండ్ పేరిట వెలసిన సంస్థ ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ లలో లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.1,200 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. 2016లోనే వెలుగు చూసిన ఈ కుంభకోణంలో మళ్ల విజయ ప్రసాద్ తో పాటు సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది. ఈ సోదాల్లో మళ్ల విజయ ప్రసాద్ ఇంటిలో రూ.44.9 లక్షల నగదు దొరికింది. అయితే కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ల విజయ ప్రసాద్ అరెస్ట్ కాలేదు. తాజాగా ఒడిశాకు చెందిన డిపాజిటర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఒడిశా సీఐడీ అధికారులు.. సోమవారం విశాఖ వచ్చి మళ్ల విజయ ప్రసాద్ ను అరెస్ట్ చేసి ఒడిశాకు తరలించారు. ఆ వెంటనే ఆయనను అక్కడి కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గానూ ఉన్న మళ్ల విజయ ప్రసాద్ అరెస్ట్ వైసీపీకి మరో మరక అంటించిందనే చెప్పాలి.
ఎన్ని అరోపణలున్నా ఫరవా లేదు
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసిన మళ్ల విజయ ప్రసాద్ విజయం సాధించారు. ఎమ్మెల్యేగా తనదైన శైలిలో చక్రం తిప్పిన మళ్ల.. వెల్ఫేర్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇందులో భాగంగానే ఆయన పొరుగు రాష్ట్రాల్లోనూ చిట్ ఫండ్ నడిపారు. అయితే మళ్లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయని, భారీ స్కాంలో చిక్కుకున్నారని, అలాంటి నేతకు ఎలా టికెట్ ఇస్తారని టీడీపీ సహా వామపక్షాలు కూడా ప్రశ్నించాయి. అయితే వీటినేమీ పట్టించుకోని జగన్ 2019 ఎన్నికల్లో విశాఖ వెస్ట్ టికెట్ ను ఆయనకు కేటాయించారు. అయితే ఎన్నికలో ఆయన టీడీపీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అప్పటికీ మళ్లను దూరం పెట్టని జగన్.. ఆయనకు తాజాగా ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. వెరసి నేరస్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారన్న విపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరినట్టైంది.
Must Read ;- 100 కోట్ట ఆస్తి 19 కోట్లకే.. బుక్కైన వైసీపీ ఎమ్మెల్యే











