కన్నడ యంగ్ స్టార్ యశ్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కేజీయఫ్ చాప్టర్ 2’ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ కు లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. మళ్ళీ తిరిగి ఈమధ్యనే ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున తెరకెకక్కుతోన్న ఈ సినిమా టీజర్ కోసం ఎప్పటినుండో యశ్ అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.
టీజర్ ఈ దసరాకు రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ పై ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఏడాది సంక్రాంతి కానుకగా టీజర్ విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం ఆలోచిస్తోందట.
ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ‘కేజీయఫ్ చాప్టర్ 1’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడమే. హీరో యశ్ కు కూడా ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ‘కేజీయఫ్ 2’ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలపై వచ్చిన వార్త నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.