టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా వలన ఆలస్యం అయ్యింది. వచ్చే నెలలో ‘ఫైటర్’ షూటింగ్ హైదరాబాద్ లో మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాను పూరి జగన్నాథ్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మర్చి నెలలో మొదలవుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇటు విజయ్ ‘ఫైటర్’ సినిమాను, అటు దర్శకుడు శివ నిర్వాణ, నానితో ‘టక్ జగదీష్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత విజయ్ – శివ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్నది.
Must Read: శివ నిర్వాణ, దిల్ రాజు సినిమాను పక్కన పెట్టేసిన విజయ్ దేవరకొండ?
ఈ విషయంపై త్వరలోనే దర్శకనిర్మాతలు మీడియా ముఖంగా తెలియజేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఆర్మీ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో విజయ్ పవర్ ఫుల్ మేజర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అంతే కాకుండా ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అసలే ప్రేమ కథలు తీయడంలో దర్శకుడు శివ దిట్ట. ఆయన దర్శకత్వం వహించిన గత చిత్రాలైన ‘మజిలీ’, ‘నిన్ను కోరి’ మంచి విజయాలు అందుకున్నాయి.
ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రేమ సన్నివేశాలను ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేల తీసాడు శివ. ఇక విజయ్ లవ్ సీన్స్ లో ఎలా చేస్తాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఇద్దరు కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పనవసరం. అసలే విజయ్ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విజయ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా బాగా నిరాశ పరిచింది. ‘ఫైటర్’, శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలతో మరల సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు విజయ్. మరి విజయ్ కోరిక తీరుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.