పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం గ్యాప్ అనంతరం నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్‘. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’ కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవన్, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పవన్ సినిమాలతో పాటు తన జనసేన పార్టీకి సంబంధించిన పనులు కూడా చూసుకుంటున్నారు. ఇటీవలే ప్రారంభం అయిన జనసేన పార్టీ సమావేశాలకు పవన్ క్లీన్ షేవ్ చేసుకొని సరికొత్త లుక్ తో హాజరైయ్యారు.
ఈ కొత్త లుక్ పై టాలీవుడ్ లో నయా చర్చ మొదలైంది. పవన్ క్లీన్ షేవ్ లో కనిపించడంతో త్వరలోనే క్రిష్ సినిమా మొదలవుతుందని, అందుకోసమే పవన్ కొత్త లుక్ లోకి మారిపోయారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ తన లుక్ పై ఎక్కువ స్పెషల్ కేర్ తీసుకొంది లేదు. సినిమాకు అవసరమైతే తప్ప తాను కొత్త లుక్ లోకి మారరు. అయితే ఇప్పడు కొత్త లుక్ లోకి పవన్ మారడంతో ఖచ్చితంగా క్రిష్ సినిమా కోసమే అని టాక్ నడుస్తోంది. పవన్, క్రిష్ సినిమాలో బందిపోటుగా కనిపించనున్నరనే వార్త ఎప్పటి నుండో టాలీవుడ్ లో వినపడుతున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్, శృతి హాసన్ పై తీయవలసిన సన్నివేశాలు ఇంకా బ్యాలన్స్ ఉన్నాయని సమాచారం. శృతి హాసన్ తో వచ్చే సనివేశాలకే పవన్ షేవ్ చేసి కొత్త లుక్ లోకి మారాడని మరికొందరు అంటున్నారు. మరి ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ తో వచ్చే సన్నివేశాల కోసం పవన్ కొత్త లుక్ లోకి మారాడా లేక క్రిష్ సినిమా కోసమా అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ‘వకీల్ సాబ్’ టీజర్ విషయంలో నిరాశచెందిన అభిమానులు