Allu Arjun Rejected Uppena Fame Buchi Babu Sana Story :
ఉప్పెన సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ఉప్పెన రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడంతో బుచ్చిబాబుతో సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ముందుకొచ్చారు. ఎన్టీఆర్ కి బుచ్చిబాబు కథ చెప్పడం.. కథ నచ్చిందని ఎన్టీఆర్ చెప్పడం కూడా జరిగింది. దీంతో ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా పక్కా.. ఇక అనౌన్స్ మెంట్ ఇవ్వడం ఒక్కటే ఆలస్యం అనుకున్నారు.
అయితే.. ఎన్టీఆర్ బుచ్చిబాబుతో కాకుండా కొరటాల శివతో ఓ సినిమా, ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. అందుకనే.. బుచ్చిబాబు బన్నీ చెంతకు చేరాడు. బన్నీకీ, బుచ్చిబాబుకీ మీటింగ్ సెట్ చేసింది సుకుమారే. బన్నీ కథ విన్నాడట కానీ.. ఏ విషయం ఇంకా చెప్పలేదని సమాచారం. కారణం ఏంటంటే… బన్నీ ఇప్పుడు డైలామాలో ఉన్నాడు. పుష్ఫ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా? అని. అటు బన్నీని కూడా… సుకుమారే గైడ్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
బన్నీకి కాస్త నచ్చజెప్పి.. శిష్యుడు బుచ్చిబాబుతో సినిమాని పట్టాలెక్కించాలన్నది సుకుమార్ ప్రయత్నం. సుకుమార్ బన్నీకి బుచ్చిబాబు గురించి చెప్పినా.. ఎందుకనో బన్నీ పాజిటివ్ గా స్పందించలేని టాక్ వినిపిస్తోంది. అయితే.. బన్నీకి వీలుకాకపోయినా.. మరో హీరోతో.. ఆ కథని సెట్ చేయడానికి సైతం సుకుమార్ ప్రయత్నాలు ప్రారంభించాడని సమాచారం. ఎప్పుడైతే… సుకుమార్ ఎంటరై.. బుచ్చికి భరోసా ఇచ్చాడో, బుచ్చి కాస్త రిలాక్స్ అయ్యాడని టాక్ వినిపించింది. మరి.. శిష్యుడు బుచ్చిబాబుకు.. సుకుమార్ ఏ హీరోని సెట్ చేస్తాడో చూడాలి.
Must Read ;- బన్నీ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట